Thursday, May 2, 2024
- Advertisement -

తమిళనాడులో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 11మంది మృతి.. 22మందికి తీవ్ర గాయాలు!

- Advertisement -

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంబవించడంతో 11మంది మృతిచెందగా,22మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ప్రతియేటా బాణా సంచా ఫ్యాక్టరీల్లో ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించినా ఎక్కడో అక్కడ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.  

శుక్రవారం మధ్యాహ్నాం విరుదునగర్ జిల్లాలోని అచంకులం గ్రామంలోని ఓ బాణసంచా కర్మాగారంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. మృతి చెందిన 11మందిలో..9మంది శరీరాలు పూర్తిగా బూడిదైపోగా..మిగిలిన ఇద్దరు సత్తూర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తుపట్టడం కష్టమైపోయిందిని పోలీసులు తెలిపారు.

తీవ్రగాయాలపాలై ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తలను మెరుగైన ట్రీట్మెంట్ కోసం మధురైలోని GRH హాస్పిటల్ కి తరలించారు. పేలుగుకి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదని పేర్కొన్నారు. అయితే చాలా మంది కాంట్రాక్టర్లు అక్రమంగా ఈ కర్మాగరాన్ని లీజ్ కి తీసుకొని నడిపిస్తున్నట్లు సమాచారం. ఇక, ఈ ఘటనపై ఈలఇరమ్పన్నై పోలీసులు కేసు నమోదు చేసి ప్రాధమిక దర్యాప్తు ప్రారంభించారు.

కడుపుబ్బా నవ్విస్తున్న ‘జాతిరత్నాలు’

న్యూస్ పేపర్ డ్రెస్‌లో శ్రీముఖి అందాల హాట్ షో.. !

నేను మళ్ళీ అక్కడికి వెళ్తాను.. దమ్ముంటే ఆపండీ: బండి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -