Tuesday, April 30, 2024
- Advertisement -

భీమవరం..ఈసారి గెలిచేది వైసీపేనా?

- Advertisement -

ఏపీ సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రచార పర్వంలో అధికార, విపక్ష కూటముల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరాయి. ఇక ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్, పవన్‌పై రాళ్ల దాడి జరుగగా ఒక్కసారిగా పాలిటిక్స్ హీటెక్కాయి.

ఇక నియోజకవర్గాల వారీగా గెలుపు ఓటములతో చర్చ జరుగుతుండగా ఈసారి భీమవరంపై వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్‌ భీమవరం నుండి పోటీ చేయగా వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించారు. కాపుల కోటలో పవన్ ఓటమి పాలు కావడం చర్చనీయాంశంగా మారింది.

ఈసారి భీమవరం పోరులో గ్రంధి శ్రీనివాస్‌ పోటీచేస్తుండగా,జనసేన తరఫున మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు బరిలోకి దిగారు. రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రామాంజనేయులు జనసేన నుండి పోటీ చేస్తుండటం విశేషం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2 ,51 ,301 ఓట్లు ఉండగా కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. తాను చేసిన అభివృద్ధి,జగన్ పారదర్శక పాలనే తనను గట్టెక్కిస్తుందని ధీమాతో ఉన్నారు శ్రీనివాస్. 2009లో తొలిసారి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రామాంజనేయులు ఆ తర్వాత టీడీపీలో చేరి రెండోసారి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మొత్తంగా వైసీపీ, టీడీపీ అభ్యర్థులు రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించగా ఈసారి ఎవరు గెలిచినా మూడోసారే అవుతుంది. మరి భీమవరంలో ప్రజలు ఎవరి వైపు మొగ్గుచూపుతారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -