Saturday, April 27, 2024
- Advertisement -

పోటీ చేయం..ఒత్తిడి చేస్తే పార్టీని వీడుతాం?

- Advertisement -

బీఆర్ఎస్… సరిగ్గా రెండు నెలల క్రితం వరకు ఏం చెబితే అదే వేదం. ఇక ఎన్నికలు వచ్చాయంటే బీఆర్ఎస్ సీటు కోసం ఉండే పోటీ అంతా ఇంత కాదు. కానీ ఎన్నికల తర్వాత పూర్తిగా సీన్ రివర్స్. ఒక్కొక్కరుగా నేతలు పార్టీని వీడుతుండగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ అంటే విముఖత చూపిస్తున్నారు. ఇంకా ఒత్తిడి చేస్తే పార్టీని వీడుతామని హెచ్చరిస్తున్నారు.

ఇక నల్గొండ లేదా భువనగిరి నుండి పోటీ చేయాలని భావిస్తున్న మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్‌ను వీడేందుకు రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ నుండి కాకుండా కాంగ్రెస్ నుండి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో భేటీ కాగా తాజాగా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరికకు సుముఖత వ్యక్తం చేయగా భువనగిరి నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నల్గొండ జిల్లాలో పట్టు ఉన్న నేత సుఖేందర్ రెడ్డి. రెండు సార్లు ఎంపీగా గెలవగా జిల్లాలో గుత్తాకు భారీ అనుచరగణముంది. ఈ నేపథ్యంలో గుత్తా ఫ్యామిలీ పార్టీ మారితే అది బీఆర్ఎస్‌కు గట్టి షాకే కానుంది.

పార్టీని వీడే నేతలు ఒకవైపు అయితే సిట్టింగ్ ఎంపీలు సైతం బీఆర్ఎస్ బీ ఫామ్‌పై పోటీ చేసేందుకు విముఖత చూపిస్తున్నారు. మొత్తంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను గులాబీ బాస్ కేసీఆర్ ఎలా చక్కదిద్దుతారో వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -