Monday, April 29, 2024
- Advertisement -

ఏపీలో అమరావతి…తెలంగాణలో కాళేశ్వరమా?

- Advertisement -

టీడీపీ చంద్రబాబు హయాంలో చేపట్టిన అమరావతి రాజధాని నిర్మాణం చంద్రబాబు పాలిట శాపంగా మారిన సంగతి తెలిసిందే. అమరావతి నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం, పలు కేసుల్లో చంద్రబాబు ఏ1గా ఉండటంతో 45 రోజులకు పైగా చంద్రబాబు రిమాండ్‌లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన కాళేశ్వరం కూడా మరో అమరావతి కానుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

2018లో బీఆర్ఎస్‌కు తిరుగులేని మెజార్టీకి కట్టబెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఆ పార్టీ పాలిట శనిశ్వరం కాబోతుందా..?కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు మొదటి నుండి ఉండగా ఇప్పుడు ఆ ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం తొలిసారి ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని పలు రిజర్వాయర్ల ద్వారా సాగు,తాగు నీటి అవసరాలం కోసం నిర్మించారు. రికార్డు స్ధాయిలో మూడున్నర సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తయింది. ఇక బీఆర్ఎస్ నేతలు, సీఎం కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించిన అంశం కాళేశ్వరమే. అందుకే 2018 ఎన్నికల్లో కాళేశ్వరం కావాలా శనిశ్వరం కావాలా అనే నినాదం ఇవ్వగా ప్రజలంతా బీఆర్ఎస్‌కే జై కొట్టారు.

కానీ ఇప్పుడు అదే కాళేశ్వరం బీఆర్ఎస్ పాలిట శనీశ్వరంగా మారనుందని అంతా భావిస్తున్నారు. కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు ఇప్పటికి కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తుండగా తాజాగా ఆ ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారెజ్ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో ఇవాళ ‘కాళేశ్వరం’ భద్రతను పరిశీలించేందుకు తెలంగాణకు రానుంది కేంద్ర బృందం. కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ పరిశీలించనుంది. దీంతో కమిటీ పరిశీలన తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

దీంతో పాటు పలు ప్రశ్నలు ఇప్పుడు అందరిని ఆలోచింపచేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు.. బోర్ హోల్ శాంపిల్స్ తీసుకుని.. భూమి సామర్థ్యాన్ని నిర్ణయించే పరీక్షలు నిర్వహించారా? ,పిల్లర్ల కింద వేసిన ఫౌండేషన్ (పియర్స్) నాణ్యతతో నిర్మించలేదా? అన్నది కమిటీ తేల్చనుంది. అలాగే ప్రాజెక్టు డిజైనింగ్ బాధ్యతను.. EPC (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ & కన్‌స్ట్రక్షన్) మెథడ్‌లో ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ కంపెనీ చేసిందా? లేక రాష్ట్ర నీటిపారుదల విభాగానికి చెందిన CDO (సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్) ద్వారా చేయించారా? అన్నదానిపై క్లారిటీ ఇవ్వనుంది. మొత్తంగా కాళేశ్వరం పిల్లర్లు కుంగిపోవడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.అయితే ఒకవేళ కాళేశ్వరం భద్రతపై కమిటీ సందేహం వ్యక్తం చేస్తే అది బీఆర్ఎస్ కు సమస్యగా మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -