Monday, April 29, 2024
- Advertisement -

మోడీ, సోనియా తెలంగాణ నుండి పోటీ చేస్తారా?

- Advertisement -

లోక్ సభ ఎన్నికలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలోని అన్ని పార్టీలు లోక్ సభ ఎన్నికలపై కార్యాచరణ సిద్ధం చేస్తుండగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ మాత్రం వైరల్‌గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుండి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇందులో కాంగ్రెస్ ఏకంగా ఓ తీర్మానమే చేసి దానిని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందించింది.

ఇక బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం అయినా ఓటు షేర్ మాత్రం 13.90 సాధించింది. దీంతో పార్టీని మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని తెలంగాణ నుండి పోటీ చేయాలని భావిస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ నాలుగు లోక్ సభ స్థానాలను గెలుచుకోగా ప్రధాని పోటీ చేస్తే ఆ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పార్టీ అగ్రనాయకత్వాన్ని కోరారు రాష్ట్ర బీజేపీ నేతలు. అయితే ఆ పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మోడీ తెలంగాణ పోటీ చేసే ఛాన్స్ లేనట్లే తెలుస్తోంది.

అయితే కాంగ్రెస్ మాత్రం ఏకంగా సోనియా గాంధీ పోటీచేయాలని తీర్మానం చేసింది. మెదక్ పార్లమెంట్ నుండి సోనియా పోటీ చేస్తే బాగుంటుందని తెలుస్తోంది. గతంలో 1980లో ఇందిరా గాంధీ యూపీలోని రాయ్ బరేలీతో పాటు మెదక్ నుండి పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే సోనియాను మెదక్ నుండి పోటీ చేయిస్తే మంచి ఫలితాలు వస్తాయని భావిస్తోంది. ఇక కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం సోనియా మెదక్ నుండే పోటీచేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -