Monday, April 29, 2024
- Advertisement -

టార్గెట్ ఏపీ..రంగంలోకి డీకే!

- Advertisement -

దక్షిణాదిన తిరిగి పట్టు సాధించేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దక్షిణాదిన కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి రాగా తమిళనాడులో డీఎంకేతో అలయన్స్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక కేరళలో సీపీఎం ప్రభుత్వం ఉండగా త్వరలో జరిగే ఏపీ ఎన్నికలపై దృష్టి సారించింది.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ఒకసారి అధికారం ఇవ్వాలని దీనికి తోడు 6 గ్యారెంటీలతో ప్రజల ముందుకు వెళ్లగా ప్రజలు ఆదరించారు. ఇక ఏపీలోనూ సత్తాచాటేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. వాస్తవానికి రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో పేరు మోసిన నాయకులు కాంగ్రెస్‌ పార్టలో ఉండేవారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. పెద్ద పెద్ద నాయకులంతా పార్టీని వీడగా మరికొంతమంది రాజకీయాలకు దూరమయ్యారు.

అయితే తెలంగాణలో ప్రజలు ఇచ్చిన జోష్‌ని ఏపీలో కంటిన్యూ చేసేందుకు ఆ పార్టీ అగ్రనేతలు రెడీ అవుతున్నారు. త్వరలోనే రాహుల్, ప్రియాంక ఏపీలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఏపీ రాజధాని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణకు తాము వ్యతిరేకమని, పోలవరం పనులు పూర్తి చేయటం,ఏపీకి ప్రత్యేక హోదా వంటి అంశాలను ప్రస్తావించనున్నారట. తెలంగాణలో లాగానే ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కు ఏపీ ఎన్నికల బాధ్యతలను అప్పగించున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా ఏపీలో మళ్లీ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -