Monday, April 29, 2024
- Advertisement -

ఐదు సార్లు ఎమ్మెల్యే వర్సెస్ సర్పంచ్!

- Advertisement -

శ్రీకాకుళం నియోజకవర్గం…ఇప్పుడు అందరి కళ్లు ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌పైనే ఉన్నాయి. ఎందుకంటే మాజీ మంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడితో ఓ యువ సర్పంచ్ తలపడనున్నారు. ఇంతకీ వారెవరు అనుకుంటున్నారా. వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు- టీడీపీ అభ్యర్థి గొండు శంకర్.

కేవలం సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం ఉన్న గొండు శంకర్‌…40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడితో తలపడుతున్నారు. ధర్మాన ఎనమిదోసారి అసెంబ్లీకి పోటీ చేస్తుండగా ఈసారి ఆయన గెలుపు నల్లేరుపై నడకే కానుందని తెలుస్తోంది. 2004,2009,2019లో శ్రీకాకుళం నుండి గెలుపొందారు ధర్మాన. అంతకముందు నరసన్నపేట నుండి రెండు సార్లు గెలుపొందారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావును ఎన్నిక‌ల క్షేత్రంలో ఎదుర్కోవ‌డం అంత సులువు కాదు. ఆయన రాజకీయ ఎత్తుగడల ముందు గొండు శంకర్‌కు పరాభవం తప్పదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీకాకుళంలో గట్టి పట్టున్న గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబాన్ని కాదని గొండు శంకర్‌కు సీటిచ్చి చంద్రబాబు సాహసం చేసినా అది గెలుపుకు దోహదపడటం కష్టమేనని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మొత్తంగా ఈసారి శ్రీకాకుళం నియోజకవర్గంలో విజేతగా ఎవరు నిలుస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -