Tuesday, April 30, 2024
- Advertisement -

మోడీ స్కెచ్..గందరగోళంలో ప్రతిపక్షం!

- Advertisement -

ఒకే దేశం ఒకే ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వేసిన ఎత్తుగడతో ప్రతిపక్ష పార్టీలు విలవిలలాడిపోతున్నాయి. ఎన్ని అభ్యంతరాలున్న జమిలీ ఎన్నికలపై తగ్గేదే అంటున్నారు ప్రధాని మోడీ. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ రిపోర్టు ఎన్నిరోజుల్లో ఇస్తుంది అన్న క్లారిటీ లేకపోయినా మోడీ మాత్రం తాను అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టేటట్టు లేడు.

ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే దేశవ్యాప్తంగా డిసెంబర్‌లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇవి ముందస్తు ఎన్నికలే. ప్రస్తుతం బీజేపీ తప్ప ఎన్నికలు మరె పార్టీ సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో జమిలీ పేరుతో మోడీ ప్రతిపక్షాలను చిక్కుల్లో పడేశారు. అసెంబ్లీ, లోక్ సభ రెండు ఎన్నికలు ఒకేసారి వస్తే తమ భవిష్యత్ ఏంటనే దానిపై పలు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.

రెండు ఎన్నికలు ఒకేసారి వస్తే ఆయా రాష్ట్రాల లోకల్ లీడర్లు, జాతీయ లీడర్లకు మధ్య కోఆర్డినేషన్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పెద్ద నేతలెవరూ అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేయడానికి టైం కూడా తక్కువగా ఉంది. ఇక ప్రధానంగా ప్రతిపక్ష కూటమి ఇండియా ప్రధాని అభ్యర్థి ఎవరో ఇంకా తేల్చుకోలేని పరిస్థితి. అంతేగాదు ఒకవేళ ప్రధాని అభ్యర్ధిగా పలాన వ్యక్తిని ప్రకటిస్తే దానిని ప్రజలు ఏ మేరకు అమోదం తెలుపుతారు..మోడీ చరిష్మాను ఢీ కొట్టేంతా సత్తా ఉంటుందా అన్నది ప్రశ్నార్ధకమే.

ముందస్తు ఎన్నికలు వస్తే అభ్యర్ధుల ఎంపిక, ప్రచార బాధ్యత, ముందస్తుగానే అన్ని వనరులు సమకూర్చుకోవాలి. ఇందులో అధికార బీజేపీ ముందంజలో ఉండగా ప్రతిపక్షం వెనుకబడే ఉంది. అందుకే జమిలీ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశం మొత్తాన్నీ, రాజకీయంగా తను గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రధాని మోడీ భావిస్తున్నారని ఆ పార్టీ ఆరోపిస్తుంది.

ఇక జమిలి ఎన్నికలు పూర్తిగా కేంద్రం పర్యవేక్షణలో జరగడంతోపాటు ఎన్నికల యంత్రాంగం మొత్తం కేంద్రప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రతిపక్ష పార్టీలకు ప్రతికూలతే. దీంతో పాటు మరో ప్రధాన సమస్య. అసెంబ్లీ ఎన్నికల్లో స్ధానిక పార్టీలకు ఓటు వేస్తే ఇంకో ఓటు కేంద్రంలోని బీజేపీకి పడే అవకాశం ఎక్కువగా అంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది క్రాస్ ఓటింగ్‌కు దారితీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా కొన్నిచోట్ల రీసెంట్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సో అంతగా ప్రభుత్వ వ్యతిరేకత ఉండకపోవచ్చు. ఇది కూడా బీజేపీకి కలిసివచ్చే అంశమే. ఓవరాల్‌గా జమిలీతో హ్యాట్రిక్ కొట్రి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు మోడీ ఉవ్విళ్లూరుతుండగా ప్రతిపక్షాలు బీజేపీని ఏవిధంగా ఎదుర్కొంటాయి అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -