Monday, April 29, 2024
- Advertisement -

పవన్‌ ఇప్పుడైనా తప్పుకుంటాడా?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ చరిత్రలో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసింది లేదు. ఎన్నికలు ఏవైనా ఏదో పార్టీతో పొత్త ఉండాల్సిందే. అయితే వామపక్షాలు లేదంటే బీజేపీ, ఇప్పుడు జనసేన. ఇలా ఎన్నిక ఏదైనా సింగిల్‌గా పోటీ చేసిన చరిత్ర లేదు. ఇక త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనుండగా పవన్‌తో పొత్తుకు సై అన్నారు.

చంద్రబాబు ఇలా జైలుకు వెళ్లారో లేదో పొత్తు పొడిచింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్న చంద్రబాబు గురించి తెలిసిన వారు మాత్రం పవన్‌ను అప్పుడే హెచ్చరించారు. బాబుతో జాగ్రత్త అని. కానీ పవన్‌ మాత్రం ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడమే పరమార్థంగా సర్దుకుపోవాలని నేతలకు చెబుతూ వచ్చారు. అయితే ఈ క్రమంలో ఇప్పటివరకు పలు దఫాల్లో ఇరు పార్టీ నేతల మధ్య చర్చలు జరిగినా జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు బాబు.

జనసేన సీట్ల సంఖ్యను ఖరారు చేయకుండా ఒక్కో స్థానంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇదే పవన్ ఆగ్రహానికి కారణమైంది. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించి చంద్రబాబుకు షాకిచ్చారు. వాస్తవానికి 68 సీట్ల జాబితాను చంద్రబాబు ముందు ఉంచారు పవన్. 45కి తక్కువ కాకుండా కేటాయించాలని విన్నవించగా అన్ని ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. దీంతో బాబు తన ప్లాన్ బీలో భాగంగా ఒక్కో స్థానంలో అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చారు. దీంతో పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేయగా ఇప్పుడు పొత్తుపై రెండు పార్టీల్లో ప్రతిష్టంభన నెలకొంది. మరి పవన్ ఇప్పటికైనా బాబు నైజాన్ని అర్ధం చేసుకుని పక్కకు తప్పకుంటారా లేదా తన స్వలాభం కోసం సర్దుకుపోతారా వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -