Tuesday, April 30, 2024
- Advertisement -

పుష్ప శ్రీవాణి..హ్యాట్రిక్ కొట్టేనా?

- Advertisement -

విజయనగరం జిల్లా కురుపాంలో ఈసారి ఆసక్తికరపోరు జరగనుంది. ఎస్టీ నియోజకవర్గంగా ఆవిర్భవించిన తొలిసారి ఇద్దరు మహిళలు మధ్య పోరు జరుగుతోంది. వైసీపీ తరపున పుష్ప శ్రీవాణి మూడోసారి పోటీ చేస్తుండగా టీడీపీ తరపున జగదీశ్వరి పోటీ చేస్తున్నారు.

2014,2019 ఎన్నికల్లో కురుపాం నుండి గెలుపొందారు పుష్ప శ్రీవాణి. ఈ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతుండగా జగదీశ్వరి సైతం టీడీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమవుతోంది. ఇక కాంగ్రెస్ -సీపీఐ-సీపీఎం కూటమిగా పోటీ చేస్తుండగా ఈ స్థానాన్ని సీపీఎంకు కేటాయించారు.

కురుపాం నియోజకవర్గం శత్రుచర్ల , వైరిచర్ల రాజ కుటుంబాలకు కంచుకోట. వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కురుపాంకు చెందినవాడు. పార్వతీపురం నుంచి ఎంపీగా అనేకసార్లు విజయం సాధించిన ఆయన గతంలో యూపీఏ హయాంలో, జనతా ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.

పుష్ప శ్రీవాణి.. మాజీ ఎమ్మెల్యే ఎన్ చంద్రశేఖర్ రాజు కోడలు. రెండు సార్లు కురుపాం నుండి గెలిచిన ఆమె గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా గెలిచి తన సత్తాచాటాలని భావిస్తున్నారు. కురుపాం, జిఎల్ పురం, జియ్యమ్మవలస, కొమరాడ, గరుగుబిల్లి మండలాల్లోని ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం తాను చేసిన కృషిని వివరిస్తూ ముందుకుసాగుతున్నారు. ఇక టీడీపీ అభ్యర్థికి వైరిచర్ల, శత్రుచర్ల కుటుంబాలు మద్దతుగా నిలుస్తుండగా పోరు ఆసక్తికరంగా మారింది. మొత్తంగా కురుపాంలో తొలిసారి ఇద్దరు మహిళా నేతలు తలపడుతుండగా గెలుపె ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -