Saturday, April 27, 2024
- Advertisement -

ఆ ఆరుస్థానాలపై కేసీఆర్ ఫోకస్!

- Advertisement -

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల రేసులో ఇప్పటికే బీజేపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ కూడా రేసులో ముందంజలో ఉండగా బీఆర్ఎస్ 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇక పొత్తులో భాగంగా బీఎస్పీకి రెండు స్థానాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన పొత్తు కుదరలేదు. దీంతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ గూటికి చేరగా ఇప్పుడు మిగిలిన ఆరు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంపై గులాబీ బాస్ కేసీఆర్ ఫోకస్ పెట్టారు.

మెదక్, నాగర్ కర్నూల్,నల్గొండ,భువనగిరి, సికింద్రాబాద్, హైద్రాబాద్ పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా నాగర్ కర్నూల్ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ దాదాపు ఖాయమైంది. ఇక మెదక్ స్థానం నుండి ప్రముఖంగా ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మదన్‌ రెడ్డికి టికెట్ నిరాకరించగా అప్పుడు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు గులాబీ బాస్. దీంతో ఇక్కడ నుండి ఎవరు పేరు ఫైనల్ అవుతుంది అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

సికింద్రాబాద్ స్థానం నుండి తలసాని సాయికిరణ్ యాదవ్,రావుల శ్రీధర్ రెడ్డి, దాసోజు శ్రవణ్ కుమార్ పేర్లు పరిశీలనలో ఉండగా భువనగిరి నుండి జిట్టాల బాలకృష్ణారెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్,క్యామ మల్లేష్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ ఆరు స్థానాల్లో హైదరాబాద్ మినహా మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు కేసీఆర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -