Thursday, May 2, 2024
- Advertisement -

చంద్రబాబు తర్వాత కేసీఆర్..ఢిల్లీకి!

- Advertisement -

తెలుగు రాష్ట్రాల కీలక నేతలు ఢిల్లీ బాట పడుతున్నారు. ఇప్పటికే బీజేపీకి పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు హస్తిన బాట పట్టారు. బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. త్వరలోనే బీజేపీతో పొత్తు ఫైనల్ కానుండగా త్వరలో బీఆర్ఎస్ – బీజేపీ ఒకటి కానున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఎవర్ని కలుస్తారనే విషయం చర్చనీయాంశంగా మారింది.

అయితే పలువురు జాతీయ పార్టీ నేతలను కలుస్తారనే ప్రచారం జరుగుతుండగా బీజేపీ అగ్రనేతల సమక్షంలో విషయంలో మాత్రం స్పష్టత లేదు. కానీ బీఆర్ఎస్ వర్గాల లీక్‌ల ప్రకారం బీజేపీ అగ్రనేతలతో భేటే అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన అజెండా ఏంటో, ఎవరెవర్ని కలుస్తారనే విష‌యాల‌ను పార్టీ గోప్యంగా ఉంచింది. దీంతో బీజేపీ నేతలను కలిసేందుకేనని రూమర్స్ షికార్ చేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -