Thursday, May 2, 2024
- Advertisement -

సీఎం రేవంత్‌పై కేసీఆర్ మార్క్ కామెంట్స్

- Advertisement -

సీఎం రేవంత్‌పై తనదైన శైలీలో విరుచుకపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ భవన్‌లో మాట్లాడిన కేసీఆర్..బీఆర్ఎస్ సర్కార్‌,తనను వ్యక్తిగతంగా దూషిస్తూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. నన్ను వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ పార్టీని కొత్త సీఎం ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు…నన్ను,నా పార్టీని టచ్ చేయడం నీతో కాదు అని చురకలు అంటించారు.

నీ కంటే హేమా హేమీలనే ఎదుర్కొన్న చరిత్ర తనకుందని..బీఆర్ఎస్‌తో పెట్టుకున్న వారు ఏం అయ్యారో చరిత్రనే సాక్ష్యం అన్నారు. రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపాడుకున్నం…దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. తెలంగాణ కోసం కెసిఆర్ ఏనాడూ వెనక్కు పోడని..ఉడత బెదిరింపులకు బయపడను…ముందు ముందు ఏందో చూద్దాం…తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు అన్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేఆర్ఎంబీ పరిధిలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని అన్నారు. అయితే, అందుకు తాము అంగీకరించలేదని చెప్పారు. ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. మా నీళ్లు మాకే అనే ప్రజా నినాదాన్ని స్వయంపాలన ప్రారంభమైన అనతికాలం లోనే నిజం చేసి చూయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -