Thursday, May 2, 2024
- Advertisement -

తెలంగాణకు త్రిముర్తులు..ఏం చేయబోతున్నారు!

- Advertisement -

తెలంగాణపై దండయాత్రకు సిద్ధం అయ్యారు బీజేపీ అగ్రనేతలు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డా ఆలా వరుసగా అగ్రనేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్‌లో ఎన్నికలు జరగనుండగా త్వరలో ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేయనుంది బీజేపీ.

రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోండగా కేడర్‌లో మరింత జోష్ నింపేందుకు రాష్ట్రానికి రానున్నారు బీజేపీ అగ్రనేతలు. తొలుత ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత అమిత్‌ షా, జేపీ నడ్డా పర్యటనలు ఉండేలా షెడ్యూల్ ఖరారు చేవారు.

ఇక అక్టోబర్‌ 1న రాష్ట్రానికి రానున్న మోడీ…పాలమూరు వేదికగా ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టనున్నారు. భూత్పూరులో మధ్యాహ్నం 1గంటకు జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇదే వేదికగా ఎన్నికల హామీలను ప్రకటించే ఛాన్స్ ఉంది. ప్రధాని బహిరంంగసభకు భారీగా జనసమీకరణకు ప్లాన్ చేస్తున్నారు బీజేపీ నేతలు. పాలమూరు తర్వాత నిజామాబాద్‌లో భారీ బహిరంగసభ ఉండేలా ప్లాన్ చేస్తుండగా అది అక్టోబర్ 3న ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధాని బహిరంగ సభల తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలతోపాటు పలువురు జాతీయ స్థాయి నేతల పర్యటనలు ఉండనున్నాయి. 17 లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పబ్లిక్ మీటింగ్‌లు ఉండేలా కార్యాచరణ సిద్ధం చేశారు. మొత్తంగా బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతల్లో జోష్ నెలకొనగా వీరికి కౌంటర్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నా బీఆర్ఎస్ లీడర్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -