Monday, April 29, 2024
- Advertisement -

బాలయ్యపై పోటికి బీజేపీ రెబల్!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ…ఈసారి టఫ్ ఫైట్‌ని ఎదుర్కోబోతున్నారా..?హిందూపూర్‌ నుండి ట్రయాంగిల్ పోటీ తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2014,2019లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలయ్య. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక బాలయ్యకు వైసీపీ నుండి గట్టిపోటీ ఎదురుకానుంది.

ఇప్పటివరకు టీడీపీ- వైసీపీ మధ్య పోటీ ఉంటుందని భావించినా తాజాగా హిందూపూర్‌ పోరు ట్రయాంగిల్‌ ఫైట్‌గా మారింది. బాలయ్య బాబును ఓడించేందుకు రంగంలోకి దిగారు కాకినాడ శ్రీపీఠం స్వామి పరిపూర్ణానంద. వాస్తవానికి బీజేపీ నుండి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. కానీ పరిపూర్ణానందకు సీటు ఇచ్చేందుకు నిరాకరించింది బీజేపీ.

దీంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు పరిపూర్ణానంద. ఎన్నికల్లో తన తడాఖా చూపిస్తానంటూ చంద్రబాబుతో పాటు బాలయ్యకు ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు. అయితే 2019లో హిందూపూర్ అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థికి 1.18% ఓట్లు రాగా ఈసారి పరిపూర్ణానంద బరిలోకి దిగుతుండటంతో బీజేపీ ఓటు శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే అది బాలయ్యకు మైనస్‌గా మారి వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బాలయ్య కొరిక నెరవేరుతుందా లేదా వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -