Monday, April 29, 2024
- Advertisement -

జనసేనతో తెగతెంపులేనా…సందిగ్దంలో టీడీపీ?

- Advertisement -

ఏపీలో టీడీపీ – జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందో లేదో అన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పవన్ ఇచ్చిన ఝలక్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు పూర్తి డిఫెన్స్‌లో పడిపోయారు. ఇప్పటివరకు చంద్రబాబు తాను ఆడిందే ఆట అనుకున్నారు. కానీ పవన్ ఇచ్చిన షాక్‌తో ఇప్పుడు జనసేనతో కలిసి ముందుకు వెళ్లాలా లేక తెగతెంపులు చేసుకోవాలా అన్న మీమాంసలో పడిపోయారు చంద్రబాబు.

ఇక పవన్ తాను ఇచ్చిన ఒక్క స్టేట్‌మెంట్‌తో పోటీ చేసే సీట్ల విషయంలో తగ్గేదే లేదని తెలిపారు. ఇక ప్రధానంగా టీడీపీ – జనసేనకు సమస్యగా మారింది ఉభయ గోదావరి జిల్లాలే. ఈ జిల్లాల్లో తమకు పట్టు ఉందంటే తమకే పట్టు ఉందని జనసేన – టీడీపీ నేతలు వాపోతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో మూడేసి నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు పవన్‌.

ఇక టీడీపీ సైతం ఎక్కవు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. అందుకే జనసేనకు ఒక్కో పార్లమెంట్ పరిధిలో ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే ఇవ్వాలని భావిస్తోంది. ముఖ్యంగా కాపు ఓట్లు ఎక్కువగా ఉండే పిఠాపురం, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ అసెంబ్లీ స్థానాలపై పట్టుబడుతున్నారు పవన్‌. ఇక ముద్రగడను పార్టీలో చేర్చుకుని ప్రత్తిపాడు సీటు ఇవ్వాలని భావిస్తున్నారు పవన్. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటికే రాజోలు నుంచి పోటీ చేస్తామని ప్రకటించింది.అలాగే ముమ్మడివరం, పిఠాపురం కోరుతుండగా ఈ స్థానాలను జనసేనకు ఇచ్చేందుఏకు సిద్ధంగా లేదు టీడీపీ.

రాజమండ్రి పార్లమెంట్‌ పరిధిలో రాజానగరంతోపాటు, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాలను జనసేన ఆశిస్తోండగా రాజానగరం అభ్యర్థిగా బలరామకృష్ణ పేరు ఇప్పటికే దాదాపు ఖరారైంది. అయితే మిగిలిన రెండు స్థానాల సంగతి తేల్చలేదు టీడీపీ. ఇవే కాకుండా రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట సీట్లను జనసేన అడుగుతుండగా వీటిని ఇచ్చేందుకు ససేమీరా అంటోంది టీడీపీ. మొత్తంగా ఒకవేళ పవన్ ఈ స్థానాల కోసం పట్టుబడితే ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు చంద్రబాబు. మొత్తంగా జనసేనతో తెగతెంపులు ఉంటాయా లేదా ఎవరు సర్దుకుపోతారు అన్నదానిపై త్వరలో క్లారిటీ రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -