Thursday, May 2, 2024
- Advertisement -

ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం భేటీ

- Advertisement -

ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రేవంత్ సీఎం అయ్యాక తొలిసారి ప్రధానితో భేటీ కానుండగా ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.

రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కొన్ని కీలక అంశాలు, ప్రతిపాదనలను ప్రధానికి వివరించే అవకాశం ఉంది.ప్రధానంగా ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు విషయాన్ని ప్రస్తావించనున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట్ స్టీల్ కోచ్ ఫ్యాక్టరీ, ఏపీతో నెలకొన్న నదీ జలాల పంపకాల వివాదం, బకాయి నిధుల విడుదల అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది.

ఉదయం హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్న రేవంత్…సాయంత్రం 4:30 గంటలకు మోడీతో సమావేశం కానున్నారు. మోడీతో సమావేశం అనంతరం కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు, శాసనమండలి స్థానాల భర్తీ పై పార్టీ హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా ప్రధానితో రేవంత్ తొలిసారి భేటీ అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -