Friday, May 24, 2024
- Advertisement -

ఏపిలో కరోనా కలకలం.. ఒక్కరోజే 98మంది మృతి

- Advertisement -

ఏపిలో రెండో దశ కరోనా తీవ్రస్తాయంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ఎపిలో గత 24 గంట‌ల్లో 89,535మందిని పరీక్షించగా.. కొత్త‌గా 22,517 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 98మంది బాధితులు మరణించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 14,11,320కి చేరుకుంది.

అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 3,383 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అనంతపురం జిల్లాలో 2,975 కేసులు, చిత్తూరు జిల్లాలో 2,884 కేసులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 98 మంది మరణించారు. ఒక్క అనంతరం జిల్లాలోనే 12 మంది కరోనాకు బలయ్యారు. ఇతర జిల్లాల్లోనూ అధిక సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి.

గ‌డిచిన 24 గంట‌ల్లో 18,739 మంది క‌రోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 11,91,687 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 2,07,467 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

భద్రతా దళాలు కాల్పుల్లో నటికీ తీవ్ర గాయాలు..?

టెన్త్, ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి : మంత్రి ఆదిమూలపు

‘వకీల్ సాబ్’ కథ ముందుగా ఆ హీరోకే వినిపించారట.. కానీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -