Monday, April 29, 2024
- Advertisement -

మైనర్‌ బాలుడితో 42 ఏళ్ల మహిళ సహజీవనం

- Advertisement -

పాశ్చాత్య కల్చర్ వచ్చాక మనవాళ్లు భాగా బ్యాడ్ అయిపోయారు. అందుల్లోను సోకాల్డ్ కమ్యునిస్టులు ఉండే ప్రాంతాల్లో విలువలకు ఒలువలు లేకుండా పోయాయి. ఎలా పడితే అలా బతికేస్తున్నారు. మన పద్దతులను తుంగలో తొక్కేస్తున్నారు. ఇది ఆ క్షణం ఏదో అధ్బుతంగా ఉందనే ఫీలింగ్ ఉండొచ్చేమో గాని మన ఇండియప్ మైండ్ సెట్ కు ఇక్కడి బతుకులకు ఏమాత్రం సెట్ కాదు. తర్వాత ఏడ్వడం తప్ప ఇక చేసేదేం లేదు. తాజాగా కేరళలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.

కేరళలోని పథినంతిట్టలో 42 ఏళ్ల నర్సు.. 18 సంవత్సరాల అబ్బాయితో ఏకంగా సహజీనం చేసేస్తూ సంచలనం సృష్టించింది. లివ్‌ఇన్‌ రిలేషన్‌ ఇదొక భాగమని ఆమె చెబుతుంది. అది సహజమే అయినా.. వయసులో ఇంత అంతరమా అని అక్కడి జనాలు ఆశ్చర్య పోతున్నారు. ఈ యవ్వారం కేరళ మహిళా కమిషన్‌కు చేరడంతో వెలుగులోకొ వచ్చింది. డబ్బు, శృంగారం.. వంటి వాటిని ఎరగా వేసి తమ కుమారుడిని నర్సు బుట్టలో వేసుకుందని ఆ యువకుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ యువకుడి తల్లి చెబుతున్న మాటల ప్రకారం… పథినంతిట్ట జిల్లా కేంద్రంలో ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కూలి చేసుకుని జీవిస్తున్నారు. వారి కుమారుడు సెకండరీ విద్యను అభ్యసించే టైమ్లో నర్సుతో పరిచయమైంది.

ఒకరోజు ఆ అబ్బాయి తమ తల్లిదండ్రులను బైక్‌ కావాలని కోరిక కోరాడు. మనవి బైక్ లు కొనే స్థాయి కాదని చెప్పారు. అదే టైమ్లో సౌదీ అరేబియాలో నర్సుగా పనిచేస్తున్న 42 ఏళ్ల మహిళ… ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. గిఫ్ట్‌ కింద బైక్‌ కొనుక్కోమని 43 వేలు ఆ యువకుడి బ్యాంక్‌ అకౌంట్‌లో డిపాజిట్‌ చేసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. సౌదీ అరేబియా నుంచి నర్సు ఇండియాకు తిరిగి రాగానే.. మా అబ్బాయిని తీసుకుని బెంగళూరు వెళ్లిపోయింది. అక్కడే ఇద్దరు ఆరు నెలల నుంచి సహజీవనం చేస్తున్నారు.

తాజా అప్ డేట్స్ ప్రకారం ఆరు నెలల తరువాత ఆ 19 ఏళ్ల యువకుడిని పేరెంట్స్ కలిసారు. జీవిత సత్యాలు భోదించడంతో వారిద్దరి మధ్య బ్రేకప్‌ అయింది. వెంటనే తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలంటూ నర్సు.. వేధింపులు మొదలు పెట్టింది. యువకుడి మీద క్రిమినల్‌ కేసులు పెట్టి.. మూడు నెలల పాటు జైలు పాల్జేసింది. కుమారుడిని విడిపించుకోవడం కోసం అతడి తల్లిదండ్రులు ఆస్తిని తనఖా పెట్టారు. దీంతో సదరు నర్సు కేరళ మహిళా మిషన్‌ను ఆశ్రయించింది.తనకు 43 వేల అసలుతో పాటూ వడ్డీ కూడా చెల్లించాలని ఆమె డిమాండ్‌ చేసింది. ఈ ఘటనపై పూర్తి విచారణ చేసిన మహిళా కమిషన్‌.. ఆమెకు దిమ్మతిరిగేలా తీర్పు చెప్పారు. ఈ సమాజానికి నీలాంటి మహిళల వల్ల ప్రమాదం ఉందని చెబుతూ.. యువకుడు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని కమిషన్‌ ప్రకటించింది.దీంతో ఆ పేద తల్లిదండ్రులకు కొండంత బలమొచ్చినట్లయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -