Tuesday, April 30, 2024
- Advertisement -

ఈ కామ‌ర్స్‌లో సంచ‌ల‌నం: ఫ్లిప్‌కార్ట్ ఆమెజాన్ చేతిలోకి?

- Advertisement -

ప్రముఖ భారత ఈ కామర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్‌ను అమెజాన్‌ కొనుగోలు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. అమెజాన్‌.కామ్‌ కొనుగోలు ప్రతిపాదనలను ఫ్లిప్‌కార్ట్‌కు పంపనున్నట్లు సమాచారం. ప్ర‌స్తుతం భార‌త్‌లో ఈ కామ‌ర్స్ వ్యాపార లావాదేవీలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ ఇంట్లో కూర్చొని త‌మ‌కు కావాల్సిన వ‌స్తువుల‌ను ఆర్డ‌రేస్తున్నారు. త‌మ‌కు న‌చ్చిన‌ట్టు షాపింగ్ సెల్‌ఫోన్‌లోనే చేస్తున్నారు. అందులో ఎక్కువ భాగం ఫ్లిప్‌కార్ట్‌లోనే చేస్తున్నారు. అలాంటిది ఫ్లిప్‌కార్ట్ అమెజాన్ చేతిలోకి వెళ్ల‌నుండ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసేందుకు వాల్‌మార్ట్‌ సంస్థ ఆస‌క్తి చూపిస్తుండ‌గా ఇప్పుడు అమెజాన్ కూడా ముందుకు వ‌చ్చింది. వాల్‌మార్ట్‌, అమెజాన్ సంస్థ‌లు ఫ్లిప్‌కార్ట్ కొన‌డానికి ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. అయితే తాజా కొనుగోలు ఒప్పందంపై అమెజాన్‌ ప్రతినిధులు స్పందించలేదు. మరోవైపు ఈ వ్యవహారంపై ఫ్లిప్‌కార్ట్‌ కూడా వెంటనే స్పందించేందుకు నిరాకరించింది.

ఫ్లిప్‌కార్ట్‌లో 40 శాతం కంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేయడానికి వాల్‌మార్ట్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఒక‌వేళ ఈ ఒప్పందం ఒకే అయితే ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెజాన్‌కు సవాలు విసరాలని వాల్‌మార్ట్ భావిస్తోంది.

2007లో ఫ్లిప్‌కార్ట్‌ను అమెజాన్‌ మాజీ ఉద్యోగులు సచిన్‌ బన్సాల్‌, బిన్నీ బన్సాల్‌ స్థాపించారు. భారత్‌లో దాదాపు 40 శాతం ఆన్‌లైన్ రిటైల్‌ వ్యాపారం ఫ్లిప్‌కార్ట్ పరిధిలో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -