Monday, April 29, 2024
- Advertisement -

జగన్ ప్రభుత్వానికి రెండో భారీ విజయం…విద్యుత్ కంపెనీలకు షాక్ ఇచ్చిన హైకోర్టు

- Advertisement -

ఎన్ని అడ్డంకులు, కేంద్రం నుంచి ఒత్తిళ్లు వచ్చినా సీఎం జగన్ పీపీఏల విషయంలో మాత్రం వెనకడుగు వేయడంలేదు. పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్ లో మొదటి విజయాన్ని అందుకున్న జగన్ ప్రభుత్వానికి రెండో భారీ విజయం దక్కింది.తాజాగా పిపిఏల సమీక్షలను చేయటానికి ప్రభుత్వానికి అన్నీ అధికారాలను ఉన్నాయని హై కోర్టు చెప్పటం సామాన్య విషయం కాదు.

పిపిఏల్లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని జగన్ ఎన్నికల ప్రాచారంలో సంచలన ఆరోపనలు చేశారు. అధికారంలోకి రాగానె పీపీఏలపై సమీక్ష చేస్తామని ప్రకటించారు. అనుకున్నట్లు గానె అధికారంలోకి వచ్చిన వెంటనె దీనిపై ఓ నిపుణుల కమిటిని నియమించారు. కమిటి కూడా అన్నీ వ్యవహారాలను అధ్యయనం చేసి సుమారు రూ. 3 వేల కోట్లు అవినీతి జరిగిందని నిర్ధారించింది.

చంద్రబాబు సర్కార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చకు రావాలని 63 జీవోను ఇచ్చింది. అయితే చాలా కంపెనీలు సమీక్షలకు రాకుండా అసలు సమీక్షలు చేసే అధికారమే జగన్ కు లేదంటూ ఇచ్చిన జీవోను కొట్టివేయాలని కోర్టుకెక్కాయి.మొదట్లో కోర్టు వైఖరి కూడా కంపెనీల వాదనకే మొగ్గు చూపినట్లు అనిపించింది. కాని కోర్టులో ప్రభుత్వ వాదనలతో సీన్ మారిపోయింది.

టీడీపీ ప్రభుత్వం అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసిందని జగన్ సర్కార్ తీవ్ర విమర్శలు చేసింది. అయితే 63 జీవోను కొట్టి వేస్తూ విద్యుత్ కంపెనీలకు షాక్ ఇచ్చేవిధంగా తీర్పు ఇచ్చింది.విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షకు అవకాశమే లేదన్న విద్యుత్‌ కంపెనీల వాదనను మాత్రం హైకోర్టు తోసిపుచ్చింది. పీపీఏల పునఃసమీక్ష కోసం ఏపీఈఆర్‌సీకి వెళ్తామంటూ ప్రభుత్వంచేసిన వాదనను సమర్థించిన హైకోర్టు, పీపీఏలను పునఃసమీక్షపై వాదనలను ఏపీఈఆర్‌సీ ఎదుటే వినిపించాలని పేర్కొంది.

ధరలను ఆరుమాసాల్లోగా సవరించుకోవాలంటూ కంపెనీలకు అల్టిమేటమ్ ఇచ్చింది కోర్టు.ఈలోగా మధ్యంతర చెల్లింపుకింద యూనిట్‌కు రూ.2. 43 నుంచి రూ. 2.44 పైసలు చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను కోర్టు అంగీకరించింది. ధరలను నిర్ణయించే అధికారం ఉన్న ఏపిఈఆర్సి అధికారాల్లో తాము తల దూర్చలేమని కూడా చెప్పేసింది. కోర్టు తాజా తీర్పుతో కంపెనీల వైఖరిలో కూడా మార్పు రావాల్సిందే అనటంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -