Tuesday, April 30, 2024
- Advertisement -

రాహుల్ వ్యాఖ్యలతో కంగుతిన్న పాక్….

- Advertisement -

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ గతంలో పూర్తిగా వ్యతిరేకించింది. ఆ పార్టీ నేతలు పాటు ఇతర పార్టీ లు కూడా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. మిత్రపక్షాల్లో ఉన్న కొన్ని పార్టీలు ఈ ఆర్టికల్ 370 రద్దును స్వాగతించడం.. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు కొందరు కాశ్మీర్ విషయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును మెచ్చుకోవడంతో పార్టీ అయోమయంలో పడింది.

కశ్మీర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై గత కొన్నిరోజులుగా రాహుల్‌ విమర్శలు చేస్తుండటంతో పాక్ ఆవ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించింది. అయితే తాజాగా పాక్ కుటిల బుద్ధికి గట్టి షాక్ ఇచ్చారు.జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం అని, ఇండియా నుంచి వేరు చేయలేరని రాహుల్ గాంధీ చెప్పారు. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని రాహుల్ పేర్కొనడం విశేషం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. కాశ్మీర్ లోయలో పాకిస్తాన్ హింసను ప్రోత్సహిస్తోందని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ తమ వైఖరిని స్పష్టం చేయడంతో పాక్ అయోమయంలో పడిపోయింది.

రాహుల్‌ ట్వీట్‌కు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ స్పందించారు. ‘కాంగ్రెస్‌ ఎప్పటినుంచో చెబుతున్నది ఇదే. జమ్ముకశ్మీర్‌ భారత అంతర్గత భాగం. ఆర్టికల్‌ 370 రద్దు ప్రక్రియను మేం వ్యతిరేకించాం. ఎందుకంటే అది రాజ్యాంగం, ప్రజాస్వామిక విలువను దెబ్బతీసేలా ఉంది. అంతేగానీ.. కశ్మీర్‌ అంశానికి మేం వ్యతిరేకం కాదు’ అని థరూర్‌ పేర్కొన్నారు. రాహుల్ ను అడ్డంపెట్టుకొని ఐక్యరాజ్య సమితిలో రగడ చేయాలనుకున్న పాక్ .. ఇప్పుడెలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -