Tuesday, April 30, 2024
- Advertisement -

గుజరాత్ లోని కచ్‌ సరిహద్దులో రెడ్‌ అలర్ట్‌ ….

- Advertisement -

ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్, పాక్ ల మధ్య విబేధాలు నిగురు కప్పిన నిప్పులా ఉన్నాయి. అంతర్జాతీయంగా భారత్ ను ఇరుకున పెట్టడానికి ఇంకా ప్రయత్నాలను కొనసాగిస్తూనె ఉంది. అయినా కూడా అంతర్జాతీయంగా పాక్ కు మద్దతు ప్రకటించలేదు. దీంతో ఉగ్రవాదులను భారత్ పై కి ఉసిగొల్పేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఆర్టికల్ 370 రద్దు రెండు దేశాల మద్య ఉన్న అన్ని సంబంధాలు తెగిపోయాయి. ఈరోజు పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు చేసిన ప్రసంగం రెచ్చగొట్టేలా ఉన్నది. ఇండియాను ఎదుర్కోవాలంటే జీహాద్ తరహా పోరాటం ఒక్కటే మార్గం అని చెప్పడంతో ఇండియా అలర్ట్ అయ్యింది.దీంతో పాటు ఉగ్రదాడులు జరగొచ్చన్న ఐబీ హెచ్చరికలు జారీ చేసింది.

దీంతో గుజరాత్‌ రాష్ట్రం కచ్‌ సరిహద్దులో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. దాయాది దేశం నుంచి భారీ సంఖ్యలో ఉగ్రవాదులు ఈ ప్రాంతం గుండా భారత్‌లోకి వ్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు భారత్‌ సరిహద్దులో భారీగా బలగాలను మోహరించింది.

రాష్ట్ర, నావికాదళం, సరిహద్దు పోలీసులు సముద్రాన్ని అణువణువునా గాలిస్తున్నాయి. అనుమానాస్పదంగా ఉండే వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

అనుమానాస్పద వాహనాలు, పడవలు, వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సరిహద్దులోని ప్రజలు, మత్స్యకారులకు సమాచారమిచ్చినట్లు తెలిపారు తూర్పు కచ్‌ ఎస్పీ పరీక్షిత్‌ రాథోడ్‌. మరోవైపు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ కూడా ఆదేశాలు జారీ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -