Thursday, May 2, 2024
- Advertisement -

72 శాతం మంది రైతులకు లబ్ధి ..!

- Advertisement -

దేశంలో వ్యవసాయం లాభదాయకంగా మారాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశీయ వ్యవసాయ రంగంలో అనిశ్చితి నెలకొందని… ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని బాగుచేయాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కి చెప్పారు. గత కొంతకాలంగా వ్యవసాయరంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను ప్రశంసించారు.

ఇక రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛనివ్వాలని.. జాతీయ వ్యవసాయ మార్కెట్(ఈ-నామ్​) వ్యవస్థను విస్తరించాలని కోరారు వెంకయ్య. అలాగే మంచి ధర పలికేవరకు రైతులకు తమ పంటలను నిల్వ చేసుకొనేందుకు శీతల గిడ్డంగులు, గోదాములు ఏర్పాటుతో సహా ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం గత కొన్నేళ్లుగా వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తోందని ప్రశంసించారు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాన​ మంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి పథకం దేశీయ రైతులకు వరం లాంటిదని.. ఈ పథకం అమలుతో దేశంలోని 72 శాతం మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -