Monday, May 6, 2024
- Advertisement -

తెలంగాణాలో పాగా వేసేందుకు వ్యూహాలు అమ‌లు చేయనున్న భాజాపా ఛీప్ అమీత్‌షా

- Advertisement -
Bjp-plans win 2019 elections telangana state

ఉత్త‌రాదిన దూసుకు పోతున్న మ‌క‌ళం చూపు ఇప్పుడు ద‌క్షిణాదిన దృష్టి సారించింది. అన్నింటి కంటే ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాల‌ని బీజేపీ అధిస్టానం ఉవ్వీలురుతోంది. అందుక‌నుగునంగా భాజాపా ఛీప్ అమీత్‌షా ముందుకు క‌దులుతున్నారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల స‌మ‌యంలో అమ‌లు చేస్తున్న ప్లాన్‌ల‌ను ఇక్క‌డ‌కూడా అమ‌లు చేయాల‌ని అమీత్ భావిస్తున్నారు.

దీనికోసం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. అమీత్‌షా క‌త్తికి రెండు వైపులా ప‌దును పెడుతున్నారు.

2019 ఎన్నిక‌ల‌నే టార్గెట్‌గా క‌మ‌ళ నాధులు క‌దులుతున్నారు. దీనికి రెండంచెల వ్యూహం అమ‌లు చేస్తున్నారు. ఇతర పార్టీల్లోని అసంతృప్త నాయకులతో బిజెపి నాయకులు చర్చలు సాగిస్తున్నారు.బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనలో వివిద పార్టీలకు చెందిన కొందరు నేతలు బిజెపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బిజెపి ప్లాన్ చేస్తోంది.ఈ మేరకు ఆ పార్టీ ద్విముఖ వ్యూహాంతో అడుగులు వేస్తోంది. తమ పార్టీలో చేరితే భవిష్యత్ ఉంటుందని హామీ ఇస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో పర్యటించే అమిత్ షా పర్యటనలో ఆయనతో ముఖాముఖి కలుసుకొనే ఏర్పాట్లు చేస్తున్నారు.

మరో వైపు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా బిజెపి చర్యలను తీసుకొంటుంది.అదే సమయంలో పార్టీని మరింత విస్తరించేందుకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాల‌ని చూస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆపార్టీకీ రాష్ట్రంలో సంస్థాగ‌తంగా ఎక్క‌డా పార్టీ ప‌టిస్టంగాలేదు. రాజ‌ధానికే ప‌రిమితం త‌ప్ప ప్ర‌జాక్షేత్రంలోకి వెల్ల‌డంలేద‌న‌డంలో సందేహంలేదు.పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం తక్షణ కర్తవ్యంగా బిజెపి భావిస్తోంది.ఈ మేరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యాచరణను మొదలుపెట్టింది. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఉన్పప్పటికీ ఆశించిన మేరకు ఆ పార్టీ దీన్ని ఉపయోగించుకోలేకపోయిందని పార్టీ జాతీయ నాయకత్వం అభిప్రాయపడుతోంది. ఇతర పార్టీల్లోని అసంతృప్తనాయకులను తమ పార్టీలో చేర్చుకొనే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది అమిత్ షా పర్యటన సందర్భంగా ఆయా పార్టీలకు చెందిన కొందరు నాయకులు బిజెపిలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఇతర పార్టీలకు చెందిన అసంతృప్త నేతలతో చర్చించేందుకుగాను బిజెపి ఓ కమిటీని ఏర్పాటు చేసింది.అంతేకాదు ఇతర పార్టీల్లో ఉన్పప్పటికీ బిజెపిలో చేరేందుకు ఆసక్తిని చూపే నాయకుల జాబితాను తయారు చేసి వారితో మంతనాలను చేయనుంది ఈ కమిటీ. ఆ మేరకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే నెలలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈనెల 23 నుండి 25 వరకు అమిత్ షా పర్యటనలోనే ఆయా పార్టీలకు చెందిన నాయకులు బిజెపి తీర్థం పుచ్చుకొనేలా ప్లాన్ చేశారు ఆ పార్టీ నాయకులు. రాష్ట్రంలోని కాంగ్రెస్, టిడిపి, టిఆర్ఎస్ పార్టీల నుండి తమ పార్టీలో చేరే జంప్ జిలానీలకు బిజెపి తీర్థం తీసుకొనే అవకాశాలున్నాయి.

ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వికారాబాద్ జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రితో పాటు మేడ్చల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేతో బిజెపి నాయకత్వం సంప్రదింపులు జరిపింది.ఈ మేరకు వారు కూడ సానుకూలంగా స్పందించారని సమాచారం. పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్న నాయకులను బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసేందుకు కూడ బిజెపి నాయకత్వం సంకేతాలను ఇచ్చింది. మరో వైపు బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు గాను బిజెపి ప్లాన్ చేస్తోంది.బూత్ స్థాయి కమిటీల సమావేశాల్లో అమిత్ షా పాల్గొంటారు. అన్నీ చూసుకుంటే క‌త్తికి ఇరువైపులా ప‌దును పెడుతున్నారు అమీత్‌షా.మ‌రి ఈ వ్యూహాలు అనుకూలిస్తాయే లేక బెడ‌సి కొడ‌తాయే చూడాలి.

Related

  1. ముందస్తు ఎన్నికలు ఇప్పట్లో లేవు : వెంకయ్య నాయుడు
  2. ద‌మ్ముంటే కాసుకోండి.. ఢిల్లీమాదే ..అమీత్‌షాకు మ‌మ‌త‌స‌వాల్‌
  3. చిరిగిపోయిన చీపురు.. పుల్ల‌ల్ని ఏరుకుంటున్న కేజ్రీ….
  4. వైకాపాలోకి పురందేశ్వ‌రీనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -