Tuesday, May 7, 2024
- Advertisement -

కృష్ణ‌జింక‌ల వేట‌గాడికి రెండేళ్లు జైలు శిక్ష విధించిన జోధ్ పూర్ కోర్ట్‌

- Advertisement -

కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోధ్‌పూర్ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను కోర్టు దోషీగా తేల్చింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం సల్మాన్‌ఖాన్‌ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. జింకల వేట కేసులో 20ఏళ్ల తరువాత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. శిక్ష ఖారారైన తరువాత జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు సల్మాన్‌ను తరలించనున్నారు.

1998 అక్టోబర్ లో కంకణి దగ్గర కృష్ణ జింకలను వేటాడినట్టు సల్మాన్ తదితరులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. సల్మాన్ పై వన్యప్రాణి చట్టం సెక్షన్ 51 కింద, మిగతావారిపై సెక్షన్ 149 కింద కేసు అభియోగాలు నమోదు కాగా, మార్చి 28న కేసు విచారణ ముగిసింది.

ఇదే కేసులో సల్మాన్‌ఖాన్ మినహా సైఫ్ అలీఖాన్, టాబూ, సోనాలీ బింద్రే, నీలమ్‌లను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా న్యాయస్థానం ఆవరణలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -