Wednesday, May 8, 2024
- Advertisement -

సీబీఐ కుమ్ములాట‌…రంగంలోకి దిగిన ప్ర‌ధాని

- Advertisement -

దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా భావించబడుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని మోడీ సర్కారు భ్రష్టు పట్టించిందని విప‌క్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అవినీతిపరులకు చుక్కలు చూపించే సీబీఐపైనే ఇప్పుడు అవినీతి మరక పడింది. ఇద్ద‌రు సీబీఐ బాస్‌ల మ‌ధ్య కేసుల వివాదం దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది. ఈ గొడవపంచాయితీ చివ‌ర‌కు ప్ర‌ధాని మోదీ ద‌గ్గ‌ర‌కు చేరింది.

రూ. కోట్ల లంచానికి సంబధించి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య నడుస్తన్న వివాదం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.రాకేష్ ఆస్థానా ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు కావడంతో… ఈ అంశం కాస్తా రాజకీయరంగు పులుముకుంది.

న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డానికి స్వ‌యంగా ప్ర‌ధాని మోదీనే రంగంలోకి దిగారు.ఇద్దరూ తన వద్దకు రావాల్సిందిగా ఆయన సమన్లు జారీ చేశారు. తనను కలిసి వివరణ ఇవ్వాలంటూ మోదీ ఆదేశించారు. రాఫెల్‌తో న‌లిగిపోతున్న మోదీకి ఈ వివాదం మ‌రోసారి ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్ల‌య్యింది.

మాంసం ఎగుమతి వ్యాపారం చేసే మొయిన్ ఖురేషీపై మనీలాండరింగ్ కేసు మాఫీ కోసం రాకేష్ ఆస్థానా రూ. కోట్ల లంచం తీసుకున్నారంటూ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదే కేసు విషయంలో లోక్ వర్మ లంచం తీసుకున్నారంటూ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఆస్థానా రెండు నెలల క్రితం లేఖ రాశారు. అయితే, రివర్స్ లో ఇప్పుడు ఆస్థానాపైనే సీబీఐ కేసు నమోదైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -