Tuesday, May 7, 2024
- Advertisement -

ఆనందయ్య మందుపై అడుగడుగునా అవరోధాలే!

- Advertisement -

ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్‌ పరిశోధన ఎటూ తేలడం లేదు. ప్రస్తుతానికి మందు తీసుకున్న వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు అధికారులు. మరోవైపు ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ పరిశోధనలు ఫలించడం లేదు. ఆయుర్వేద వైద్యులు రెండు రోజులుగా పరిశోధనల కోసం ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకు అధ్యయనంలో ముందడుగు పడలేదు.

ఇదిలా ఉంటే.. మందు వాడిన 500 మందిని ఫోన్‌ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేశారు అధికారులు. వారిలో 92 మంది ఫోన్‌ లిఫ్ట్ చేయలేదంటున్నారు ఆయుర్వేద వైద్యులు. 42 మంది మందే తీసుకోలేదని చెప్పారు. 36 మంది రోగుల జాబితాలో ఒకటే ఫోన్‌ నెంబర్ ఉంది. ఇలా ఫోన్లలో ఎవరూ సరిగా అందుబాటులోకి రాకపోవడంతో అధ్యయనంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు.

మరిన్ని నెంబర్లు పంపాలంటూ నెల్లూరు అధికారులను కోరారు వైద్యులు. రోగుల నుంచి పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ వస్తేనే తర్వాత పరిశోధన ఉంటుందన్నారు వైద్యులు. దాంతో ఆనందయ్య మందుపై అడుగడుగునా అవరోధాలే ఎదురవడంతో పరిశోధనకు మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి.

బీభ‌త్సం సృష్టిస్తోన్న యాస్ తుపాను.. వీడియో వైరల్

టాలీవుడ్ విషాదం.. ‘అనుకోని అతిథి’ నిర్మాత కన్నుమూత

నేటి పంచాంగం,బుధవారం(26-05-2021

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -