Tuesday, April 30, 2024
- Advertisement -

తెలంగాణా ప్ర‌భుత్వం పెట్టుకున్న ఆశ‌ల‌పై నీల్లు చ‌ల్లిన కేంద్రం మంత్రి

- Advertisement -

జాతీయ ప్రాజెక్టులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరమే చివరి ప్రాజెక్టు అని, ఇక మీదట రాష్ట్ర ప్రాజెక్టులకు జాతియ హోదా ఉండదని తేల్చి చెప్పారు. పోల‌వ‌ర‌మే చివ‌రి జాతీయ ప్రాజెక్ట‌ని …ఇక ఏరాష్ట్రంలో కూడా జాతీయ ప్రాజెక్టులు చేప‌ట్ట‌బోమ‌ని వెల్ల‌డించారు.

కేంద్ర మంత్రి వ్యాఖ్య‌లు తెలంగాణా ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌రంగా మారాయి. తెలంగాణా నిర్మిస్తున్న ప్రాజెక్టుల‌లో ఒక్క‌దాన్నైనా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాల‌ని పెట్టుకున్న ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. దీంతో జాతీయ ప్రాజెక్టు విషయంలో ఆయన సమాధానం ఇస్తున్నంత సేపు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తెరాస ఎంపీలకు సభలో మాట్లాడే అవకాశం రాలేదు. దీంతో ఎంపీ వినోద్ కుమార్ వెంటనే గడ్కరీకి లేఖ రాశారు. తెలంగాణ సీఎంతో పాటు తమ ఎంపీలు నాలుగేళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారని, దీనిని విస్మరించరాదన్నారు. చట్ట ప్రకారం పోలవరంకు జాతీయ హోదా ఇచ్చారని, అదే చట్టంలో పేర్కొన్న కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకదానికి ఇవ్వాలని కోరారు.

జాతీయ ప్రాజెక్టు విషయంలో ఆయన సమాధానం ఇస్తున్నంత సేపు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తెరాస ఎంపీలకు సభలో మాట్లాడే అవకాశం రాలేదు. దీంతో ఎంపీ వినోద్ కుమార్ వెంటనే గడ్కరీకి లేఖ రాశారు. తెలంగాణ సీఎంతో పాటు తమ ఎంపీలు నాలుగేళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారని, దీనిని విస్మరించరాదన్నారు. చట్ట ప్రకారం పోలవరంకు జాతీయ హోదా ఇచ్చారని, అదే చట్టంలో పేర్కొన్న కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకదానికి ఇవ్వాలని కోరారు.

కొండ ప్రాంతాలు, ఈశాన్యరాష్ట్రాల్లో చేపట్టే ప్రాజెక్టులకు 90 శాతం నిధులను కేంద్రం, మిగతా 10 శాతం రాష్ట్రాలు సమకూరుస్తాయని గడ్కరీ తెలిపారు. ఏఐబీపీ కింద 9 ప్రాజెక్టులుండగా, కరువుపీడిత ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్రాల వాటా 60: 40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయని అన్నారు. రాజ్యాంగం ప్రకారం సాగునీటి బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలదేనని, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే విధానం ఇప్పుడు లేదని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -