Monday, April 29, 2024
- Advertisement -

మేడిపండు చూడ మేలిమైయుండు.. తాత్కాలిక స‌చివాల‌యం చూడ నీరు ఉండును….

- Advertisement -
Chandrababu duplicate ap secretariat and Assembly

ప్ర‌పంచ రాజ‌ధానిని నిర్మిస్తామ‌ని చెప్పుకొనే ..ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక రాజధాని అమరావతి అతలాకుతలం అయింది.చంద్ర‌బాబు చెప్పే హెటెక్ టెక్నాల‌జీ నీల్ల‌పాల‌య్యింది. వెలగపూడిలోని నిర్మించిన అసెంబ్లీ, సచివాలయం గుట్టు రట్టైంది.

దేశంలో ఎక్కడా లేని విధంగా భారీ ఖర్చు చేసి నిర్మించిన సచివాలయం, అసెంబ్లీలు ఆరు నెలల్లోని నిర్మాణంలోని బలహీనతను బయటపెట్టాయి.
ఒక్క వర్షంతో.. తాత్కాలిక నిర్మాణాలే అయినా ప్రపంచ స్థాయి టెక్నాలజీని ఉపయోగించామన్న పాలకుల మాట నీటి మూటేనని తేలింది. తాత్కాలిక నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందన్న ప్రజల అనుమానం నిజమైంది. ఇంతా జరుగుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం ఐదో రోజు నవనిర్మాణ దీక్ష పేరుతో ఊకదంపుడు ఉపన్యాసాలు వినిపించారు.

{loadmodule mod_custom,GA1}

దాదాపు వెయ్యి కోట్ల ఖర్చు.. మొత్తంగా ఏడాది కాలం పాటు నిర్మాణం.. మరి, ఇంత గొప్పగా నిర్మించినప్పుడు, ఆ ప్రాంగణమెలా వుండాలి.? అద్భుతంగానే తయారైంది. కానీ, మేడిపండు చందమే అని ఇప్పుడు నిరూపితమయ్యింది. ఒక్క వాన.. అదీ గట్టిగా కురిసిన వాన.. అందునా, తొలి వర్షాకాలం. దెబ్బకి ‘మేడిపండు’ రహస్యం బయటపడిపోయింది. అసెంబ్లీ, సచివాలయ భవనాలు.. ఇవేవీ ‘లీకేజీలకు అతీతం’ కాలేకపోయాయి. దాదాపు అన్ని చోట్లా లీకేజీలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
భారీ దోపిడీకి తెరతీస్తూ చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన తాత్కాలిక భవనాల నిర్మాణానికి ప్రపంచంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఖర్చు చేశారు. చదరపు గజానికి ఏకంగా రూ.10 వేలు ఖర్చుచేసి మొత్తం రూ.9వేల కోట్ల ప్రజాధానాన్ని బొక్కేశారు. కట్టిన ఆరు నెలల్లోనే రాజధాని బండారం బట్టబయలు కావడంతో నవ్వులపాలైన సర్కారు..
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కి సంబంధించిన చాంబర్‌ అయితే, బొక్కలు పడ్డ రేకుల షెడ్‌ని తలపించింది. లోపల ఖరీదైన ఫర్నిచర్‌.. పైనుంచి మాత్రం యధేచ్ఛగా కారుతున్న వర్షపు నీరు.. వెరసి, అమరావతి పరువు పోయింది. ఇంతకీ, వేల కోట్లు ఎందుకు ఖర్చయ్యాయి.? నాణ్యత ఏది.? ఈ పాపానికి బాధ్యత ఎవరు వహిస్తారు.? ఇవి మాత్రం ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్‌ ప్రశ్నలే.

{loadmodule mod_custom,GA2}

ఆత్మగౌరవమని చెప్పుకునే సచివాలయ ప్రాంగణం విషయంలో ఇంత నిర్లక్ష్యమా అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇది తప్పు మాత్రమే కాదు.. తీవ్రంగా పరిగణించాల్సిన నేరం కూడా. మరి, శిక్ష ఎవరికి.? వెయ్యి కోట్లు అంటే, అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు.. ప్రజాధనం. మరి, ఆ ప్రజాధనం దుర్వినియోగమయినప్పుడు బాధ్యత వహించాల్సిందెవరు.? రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడీ దారుణంపై పెదవి విప్పాల్సిందే.
తాత్కాలిక సచివాలయం పేరుకే తప్ప.. నిర్మాణాల పరంగా కాదని చంద్రబాబు చెప్పారు. పైన ఇంకో ఆరేడు అంతస్తులు వస్తాయన్నారు. ఇప్పుడు అమరావతి ఇంతలా నీరుగారిపోయాక, రేప్పొద్దున్న శాశ్వత భవనాల పరిస్థితి ఇంకేమవుతుందో.! ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరించేయడం ఖాయం. దీనిపైన చంద్ర‌బాబు స్పందిస్తారాలేక లేక కొత్త క‌థ‌లు చెప్తారో చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -