Friday, May 24, 2024
- Advertisement -

భూమా కుటుంబానికి అవమానం.. శిల్పాకే నంద్యాల టికెట్..?

- Advertisement -
Chandrababu May Give Empty Hand Akhila Priya

నంద్యాల ఉపఎన్ని పంప‌చాయితీ  ఓకొలిక్కి వ‌చ్చినట్లు తెలుస్తోంది. గ‌త కొన్ని రోజులుగా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఎట్ట‌కేల‌కు శిల్పామోహ‌న్‌రెడ్డికి టికెట్టు ఇవ్వ‌డానికి బాబు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.మందు నుంచి టికెట్టు కోసం భూమా,శిల్పా వ‌ర్గం మ‌ధ్య పోటీ నెల‌కొంది. ఈ పోటీకీ బాబు తెర దించిన‌ట్లు టీడీపీ వ‌ర్గాలు అంటున్నాయి.ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే తన రాజకీయ భవిష్యత్తుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉండి తీరుతానని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అవసరమైతే తన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటానని ప్రకటించారు కూడా. దీంతో ఈ పరిణామాలు పార్టీ నష్టపోయేందుకు కారణం అవుతాయని భావించిన చంద్రబాబు ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో శిల్పా వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

భూమా మ‌ర‌ణంలో  నంద్యాల ఉప ఎన్నిక‌ల అనివార్య‌మైంది. టికెట్టు విష‌యంలో టీడీపీలో అంత‌ర్గ‌త వార్ తారాస్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే.  తన తండ్రి భూమా నాగిరెడ్డి హఠార్మరణంతో ఖాళీ అయినందున సంప్రదాయం ప్రకారం నంద్యాల టికెట్ తమ కుటుంబానికే దక్కాలని మంత్రి భూమా అఖిలప్రియ  ప‌ట్టుబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే., అటు శిల్పా మోహన్ రెడ్డికి గానీ ఇటు అఖిలప్రియ కుటుంబ సభ్యులకు గానీ టికెట్ ఇస్తే కుమ్ములాటలు తప్పవని చంద్రబాబు గ్రహించి, వివాదనికి వారం రోజుల్లో తెర దించడానికినడుం బిగించారు. అందులో భాగంగానే శిల్పా సోదరులతో చంద్రబాబు అమరావతిలోని తన కార్యాలయంలో బుధవారం రాత్రి సుదీర్ఘంగా చర్చించారు.

ఉప ఎన్నికల్లో పోటీ అవకాశం నుంచి తప్పుకుంటే శాసనమండలి చైర్మన్ పదవిని సీఎం చంద్రబాబు ఇవ్వనున్నట్లు తెలిపినా శిల్పా    తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో బాబు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తనపై నమ్మకం ఉంచాలని చెప్పి పంపినట్లు సమాచారం. ఒక దశలో పరోక్షంగా టికెట్ ఇవ్వడం ఖాయమని ఆయన సంకేతమిచ్చారని తెలుస్తోంది. దీంతో సంతృప్తి చెందిన శిల్పా సోదరులు పార్టీ మారాలన్న ఆలోచనను తాత్కాలికంగా పక్కనపెట్టి నియోజకవర్గంలోని తన కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో నిమగ్నం కావాలని నిర్ణయానికి వచ్చారని టిడిపి జిల్లా నేతల ద్వారా తెలుస్తోంది. 

కాగా శిల్పాకు టికెట్ కేటాయింపు విషయంలో భూమా వర్గాన్ని బుజ్జగించేందుకు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి మాజీ మంత్రి ఫరూక్ తో చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో చంద్రబాబు జిల్లా పర్యటనకు రానున్నారని ఆ సమయంలో ఎస్వీ ఫరూక్ తో మంతనాలు సాగుతాయని వారు అంటున్నారు.  మొత్తంగా తమ నాయకుడికే టికెట్ ఖరారు అయిందని శిల్పా వర్గం చేస్తున్న ప్రచారంపై భూమా కుటుంబ సభ్యులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలిమరి.

ఇప్ప‌టి వ‌ర‌కూ శిల్పామోహ‌న్‌రెడ్డికి టికెట్టు ద‌క్క‌క‌పోతే వైసీపీలోకి వ‌స్తార‌నీ ఎదురుచూసిన జ‌గ‌న్‌కు కాస్త నిరాశే మిగిలింది. ఇక శిల్పాకు టికెట్టు క‌రార‌యిన నేప‌థ్యంలో …. నంద్యాల ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున పోటీకి దించాల్సిన అభ్యర్థి పేరును వైయస్ జగన్ ఖరారు చేసినట్లు సమాచారం. పట్టణంలోని సినీ థియేటర్ల యజమాని ఉలవల ప్రతాపరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. టిడిపిని వీడి తమ పార్టీలోకి శిల్పా వస్తారని వేచి చూసిన జగన్ బుధవారం రాత్రి అమరావతిలో జరిగిన పరిణామాలను తెలుసుకున్న అనంతరం ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రతాపరెడ్డికి సంకేతాలు పంపారని చెబుతున్నారు.

Related

  1. మండలి బుద్దప్రసాద్, పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళ దగ్గర తెలుగు నేర్చుకో…!
  2. చంపేస్తామంటు కిష‌న్‌రెడ్డికి పోన్ కాల్స్
  3. త్వ‌ర‌లోజ‌గ‌న్‌తో శిల్పామోహ‌న్‌రెడ్డి భేటీ
  4. ఫేస్‌బుక్ మాయ‌లేడీ..యువ సాప్ట్ వేర్ ఇంజినీర్‌కు చుక్క‌లు చూపించింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -