Saturday, April 27, 2024
- Advertisement -

ప్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్‌లు..

- Advertisement -

దేశీయ మార్కెట్లపై కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపిస్తున్నాయి. కన్నడ పీఠం ఎవరికి దక్కుతుందో అని యావత్ భారతం ఎదురుచూస్తోంది. దీని ప్ర‌భావంతో స్టాక్ మార్కెట్‌లు ప్లాట్‌గా ముగిశాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఆచితూచి వ్యవహరించడంతో మార్కెట్‌ ఆద్యంతం ఒడుదొడుకులను ఎదుర్కొంటూ స్తబ్దుగా సాగాయి.

మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈరోజు మార్కెట్ ఫ్లాట్ గా ముగిసింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 21 పాయింట్ల లాభంతో 35,557 పాయింట్ల వద్ద, నిఫ్టీ క్రితం సెషన్ తో పోలిస్తే ఎలాంటి మార్పు లేకుండా 10,807 పాయింట్ల వద్ద ముగిసింది.

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డిన వాటిలో ఎన్టీపీసీ(2.27%), డాక్ట‌ర్ రెడ్డీస్(1.51%), ఇండ‌స్ ఇండ్ బ్యాంక్(1.07%), ఎస్బీఐఎన్(0.98%), హీరో మోటోకార్ప్(0.94%), ప‌వ‌ర్ గ్రిడ్(0.89%) ముందు వ‌రుస‌లో ఉండ‌గా, మ‌రో వైపు ఎం అండ్ ఎం(2.17%), టాటా మోటార్స్(2.00%), యెస్ బ్యాంక్(1.51%), భార‌తీ ఎయిర్టెల్(1.09%), అదానీ పోర్ట్స్(0.94%) న‌ష్టాల్లో ముగిశాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -