Tuesday, April 23, 2024
- Advertisement -

ప్ర‌యివేటు ఆస్పత్రుల్లో రూ. 250కే కరోనా టీకా

- Advertisement -

దేశంలో క‌రోనా ప్రభావం త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టు క‌న‌బ‌డిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ చాప‌కింద నీరులా వైర‌స్ వ్యాప్తి పేరుగుతోంది. దీంతో కొత్త కేసులు అధికంగానే న‌మోద‌వుతున్నాయి. దీనికి తోడు క‌రోనా మ‌హ‌మ్మారి ఉత్ప‌రివ‌ర్త‌నాలు దేశంలో 7000 వేల‌కు పైనే ఉన్నాయ‌నీ, ఇందులో అత్యంత ప్ర‌మాద‌కరంగా వేరియంట్లు కూడా ఉన్నాయ‌నే నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ప్ర‌యివేటు ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల‌లో ఒక్కో డోసు క‌రోనా వ్యాక్సిన్ ధ‌ర 250 రూపాయ‌ల‌కు మించ‌రాద‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్ర‌భుత్వ ఆస్పత్రుల్లో మాత్రం ఉచితంగానే క‌రోనా టీకాను అందిస్తామ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. మొద‌టి విడుత‌లో భాగంగా మూడు కోట్ల మందికి క‌రోనా టీకాలు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనిని అనుగుణంగా మొద‌టి ప్రాధాన్య‌తో దేశంలోని వైద్యులు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్ల‌కు క‌రోనా టీకాను అందించింది.

తాజాగా 60 ఏండ్ల‌కు పై బ‌డిన వారితో పాటు 45 ఏండ్లు దాటి దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారికి క‌రోనా టీకాలు అందిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వం ప్ర‌యివేటు ఆస్ప‌త్రులు, ఆరోగ్య కేంద్రాలు టీకాలను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. సోమ‌వారం నుంచి ఈ కార్య‌క్ర‌మం ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ల‌బ్దిదారులు టీకాను ఎక్క‌డ తీసుకోవాల‌నేది వారి అభిష్టానికి వ‌దిలేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దీని కోసం లబ్దిదారులు మొద‌ట కోవిన్‌, ఆరోగ్య సేతు యాప్‌ల‌‌లో రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది.

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ: వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన ఉప్పెన‌ హీరో, హీరోయిన్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -