Sunday, April 28, 2024
- Advertisement -

డేంజర్ కరోనా: నిర్బంధంలోకి కరీంనగర్

- Advertisement -

నిన్నటి వరకు తెలంగాణలో ఒక్క కరోనా వైరస్ కేసే. కానీ నిన్న రాత్రి ఏకంగా ఎనిమిది కేసులు నమోదు కావడం.. వారంతా వివిధ ప్రార్థనాలయాలు, ప్రాంతాల్లో విచ్చలవిడిగా పర్యటించడంతో తెలంగాణలో కరోనా కలకలం చెలరేగింది.

ఇండోనేషియాకు చెందిన ఒక వర్గానికి చెందిన 9మంది ప్రబోధకులు కరీంనగర్ లో విస్తృతంగా పర్యటించారు. రెండు రోజుల పాటు ఓ ప్రార్థనాలయంలో ఉండి మరో రెండు ప్రార్థనాలయాల్లో ప్రబోధాలు వినిపించారు. హోటల్స్ కెళ్లి టిఫిన్స్, బోజనాలు చేశారు. గల్లీల్లో తిరిగారు. కొందరి ఇంటికెళ్లి విందు, వినోదాల్లో పాలుపంచుకున్నారు. పలు కార్యక్రమాల్లోనూ బయట సంచరించారు. ఇప్పుడు ఇండోనేషియా నుంచి వచ్చిన వారిలో మొదట మంగళవారం ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారితోపాటు వచ్చిన ఏడుగురికి పరీక్షలు నిర్వహించగా వారికి కూడా కరోనా పాటిటివ్ అని తేలడంతో కరీంనగర్ లో కలకలం చెలరేగింది. జనాలు ఉలిక్కిపడుతున్నారు.

కరీంనగర్ లో ఈ 9మంది మత ప్రబోధకులు విస్తృతంగా పర్యటించడంతో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. వారు బస చేసిన కరీంనగర్ లోని ఆ ప్రార్థనాలయాన్ని పోలీసులు, అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున పారిశుధ్య చర్యలు చేపట్టారు. ఎవరిని ఇంట్లోంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. హైదరాబాద్ నుంచి వచ్చిన 100 ప్రత్యేక బృందాలు ఇప్పుడు ఇండినేషియన్లు తిరిగిన ప్రాంతాల్లో అందరి రక్తనమూనాలు తీసుకుంటున్నారు.

ఓ రకంగా ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావంతో కరీంనగర్ లో అప్రకటికత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. జనాలను ఇంట్లోంచి బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. ఇండోనేషియన్లు తిరిగిన ప్రాంతాలను అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఇక ప్రబోధకులు కలిసిన వారిని, తిరిగిన ప్రాంతాల్లో అనుమానుతులను గుర్తించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పరీక్షల కోసం పంపిస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా కరోనా కరీంనగర్ లో బయటపడడం.. ఆ ఎనిమిది మంది విస్తృతంగా కరీంనగరంలో పర్యటించడంతో ఈ వ్యాధి ఇంకా ఎంత మందికి సోకిందనే ఆందోళన నగరవాసుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. కరీంనగర్ లో 8 కేసులు వెలుగుచూడడంతో నగరం మొత్తం అప్రకటిత బంద్ నెలకొంది. ఒక్క పురుగు కూడా బయట కనిపించడం లేదు. ఇంకా ఎంత మందికి సోకిందనే భయంతో జనాలు ఇళ్లలోనే హడలి చస్తున్నారు. ప్రబోధకులతో కలిసిన వారు వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి క్యూ కట్టారు. అధికారులు జనాలను బయటకు రావద్దని.. ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు. దాదాపు 100 వైద్య బృందాలతో కరీంనగర్ లో తిరుగుతూ హైఅలెర్ట్ ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -