Thursday, April 25, 2024
- Advertisement -

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమన్న సిర్పూర్కర్ కమిషన్

- Advertisement -

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటన తర్వాత నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదక కలకలం రేపుతోంది. ఈ ఎన్‌కౌంటర్ పచ్చి బూటకమని కమిషన్ తేల్చింది. నిరాయుధులుగా ఉన్న నిందితులను పోలీసులే చంపారని స్పష్టం చేసింది. ఇందుకు బాధ్యలైన 10 మంది పోలీసులపై ఐపీసీ సెక్షన్ 301 ప్రకారం హత్య కేసులు నమోదు చేయాలని సిఫారసు చేసింది.

ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నది నమ్మశక్యం లేదని తేల్చి చెప్పింది. మాజీ జస్టిస్ వి.ఎస్‌.సిర్పుర్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్ సుప్రీం కోర్టుకు ఇటీవల సీల్డ్‌ కవర్‌లో సమర్పించిన నివేదిక వివరాలు బయటకు వెల్లడయ్యాయి.

అయితే ఈ నివేదికను బహిర్గతం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ ..సుప్రీం కోర్టు సిర్పుర్కర్ రిపోర్టును బయటపెట్టింది. ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు సుప్రీం కోర్టు బదిలీ చేసింది. కేసుకు సంబంధించిన రికార్డులన్నీ హైకోర్టుకు పంపింది.

గుడ్‌ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్

తెలంగాణ రాజకీయాలపై పవన్ కల్యాణ్ ఫోకస్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -