Tuesday, May 7, 2024
- Advertisement -

రాష్ట్ర రాజ‌కీయాల‌లో తీవ్ర ఉత్వంఠ‌…వైసీపీ శ్రేనులలో ఆందోళ‌న‌

- Advertisement -
Early election VS YS Jagan Bail issue 

ఏపీ రాజ‌కీయాల‌లో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. ఒక ప‌క్క టీడీపీ,వైసీపీ మ‌ధ్య సోషియ‌ల్ మీడియా వార్ ఏరేంజ్‌లో జ‌రుగుతుందో చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇప్పుడు అంత‌కంటే  మ‌రో స‌మ‌స్య రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

చంద్ర‌బాబు ముంద‌స్తు ఎన్న‌క‌లంటూ బాబు..మ‌రో ప‌క్క‌జ‌గ‌న్ బేయిల్ ర‌ద్దు వ్య‌వ‌హారాం ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌లతో టీడీపీ సిద్ద‌మ‌వుతోంటే…వైసీపీ శ్రేనులలో ఆందోల‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక వేల జ‌గ‌న్ బేయిల్ ర‌ద్దు చేస్తే వైసీపీకీ పెద్ద ఎదురుదెబ్బే త‌గిలిన‌ట్టే.

ముంద‌స్తు ఎన్న‌క‌ల‌కు ప్ర‌ధానంగా బీజేపీ దేశ‌వ్యాప్తంగా ఒకే సారి  లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి జరగాలన్న మోడీ వ్యాఖ్య‌లు అందుకు నిద‌ర్శ‌నంగా కనిపిస్తున్నాయి.   ఆ దిశగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ ఒప్పించి ముందస్తు ఎన్నికల తెచ్చే అవకాశం ఎక్కువ‌గానే ఉంద‌ని రాజ‌కీయ విశ్లేషులు  చెప్తున్నారు.. ముంద‌స్తు ఎన్నిక‌ల స‌మాచారంతో  ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయ‌డు అందుకు త‌గ్గ‌ట్టుగానే వెల్తున్నారు.ఎన్నిక‌లు ఎప్పుడైనా రావ‌చ్చ‌ని  అందుకు  టీడీపీ శ్రేనులు సిద్దంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు.  ఇప్పటి నుంచి అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారం షురూ చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసేశారు. ఇంక ఏమాత్రం అలక్ష్యం ఉండరాదని హెచ్చరించారు.తాజాగా కేంద్ర – రాష్ట్ర మంత్రులను పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జీ – పార్టీ బాధ్యతల పర్యవేక్షణకు నియమించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. బాబు దూకుడు చూస్తుంటే మెరుగపు బేగంతో ముందస్తు ఎన్నికలకు సన్నద్దం అవుతున్నట్లు చెప్తున్నారు. కాగా కీలకమైన విజయవాడ బాధ్యతలు యువనేత నారా లోకేష్ కు అప్పగించడం గమనార్హం.

ముంద‌స్తు ఎన్నిక‌ల‌ని టీడీపీ దూకుడుగా వెల్తుంటే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ మాత్రం ఆందోళ‌న‌లో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు బెయిల్‌మీద జ‌గ‌న్ బ‌య‌టుండ‌టంతో ఆపార్టీ శ్రేనుల్లో కాస్త ధైర్యంగా ఉండేది. కానీ జ‌గ‌న్ నిబంధ‌న‌లు ఉల్లంగించార‌నీ బెయిల్‌ను ర‌ద్దుచేయాల‌ని సీబీఐ కోర్టును ఆశ్ర‌యించ‌డంతో ఇప్పుడు ఉత్కంఠ నెల‌కొంది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుపై వాద‌న‌లు విన్న సీబీఐ కోర్టు ఈనెల 28 కి తీర్పును వాయిదా వేసింది.ఇప్పుడు అంద‌రి చూపు బెయిల్ ర‌ద్దుపైనే. ఒక వేల బెయిల్‌ను ర‌ద్దుచేస్తే వైసీపీ శ్రేనులు పూర్తిగా డీలా ప‌డిపోతారు. ఇది ప్ర‌ధానంగా పార్టీపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా  వైసీపీ శ్రేనుల‌ను తీవ్ర నిరాశ‌లో ముంచెత్తుతుంది. ఇదే జ‌రిగితే వైసీపీకీ పెద్ద కోలుకోలేని దెబ్బ త‌గిలిన‌ట్లే. ఇప్పుడు అంద‌రి చూపు జ‌గ‌న్ బేయిల్ ర‌ద్దు  మీద‌నే ఉంది. 

ప్ర‌స్తుతం రాష్ట్రంలో రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. బాబు ముంద‌స్తు ఎన్నిక‌లని దూకుడుగా ఉంటే వైసీపీ శ్రేనులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో అంద‌రి చూపు  28 వ‌తేదీమీద‌నే ఉంది. జ‌గ‌న్ బేయిల్‌ను సీబీఐ కోర్టు క్యాన్సిల్ చేస్తే మాత్రం రాజ‌కీయాలు మ‌రో మ‌లుపు తిరుగుతాయ‌న‌డంలో సందేహంలేదు.

Also Read

  1. ముంద‌స్తు ఎన్నిక‌ల‌ని  మ‌రోసారి చేతులు కాల్చుకోవాలా బాబు…..
  2.  వైసీపీ …టీడీపీ మ‌ధ్య సోషియ‌ల్ వార్
  3. నంద్యాల ఎన్నిక సెంటీమెంట్ అస్త్రం టీడీపీకీ ఫ‌లిస్తుందా..?
  4. కాన్ఫిడెన్సా …. ఓవ‌ర్ కాన్ఫిడెన్సా

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -