Thursday, May 2, 2024
- Advertisement -

20 మంది ఆప్ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు..

- Advertisement -

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆప్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ఈసీ పేర్కొంది. వీరిని అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సిఫారసు చేసింది. వీరంతా పార్లమెంటు సెక్రటరీలుగా లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నారని తెలిపింది.

ఒకవేళ ఈ 20 మందిని రాష్ట్రపతి అనర్హులుగా ప్రకటిస్తే… ఈ స్థానాలకు ఉపఎన్నిక జరుగుతుంది. 70 మంది ఎమ్మెల్యేలు ఉండే ఢిల్లీ అసెంబ్లీలో 66 మంది ఆప్ కు చెందినవారే ఉన్నారు. దీంతో వీరిపై అనర్హత వేటు పడ్డా కేజ్రీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. కాకపోతే, పార్టీకి మాత్రం పెద్ద దెబ్బ తగిలినట్టే.

2015లో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 21మందిని పార్లమెంటు సెక్రటరీలుగా కేజ్రీవాల్ నియమించారు. వారికి కారు, కార్యాలయం, ఇతర వసతులు కల్పించాడు. తద్వారా వారందరికీ కేబినెట్‌ హోదా ఇచ్చినట్లయింది. పరిపాలనా సౌలభ్యానికే వీరిని పార్లమెంట్‌ కార్యదర్శులుగా నియమించినట్లు అప్పట్లో కేజ్రీవాల్‌ చెప్పుకొచ్చారు. పైగా వీరికి ఎటువంటి అదనంగా చెల్లింపులు చేయబోమని చెప్పారు.

దీనికి సంబందించిన బిల్లును రాష్ట్ర‌ప‌తికి పంపారు. ఎమ్మెల్యేల విష‌యం కావ‌డంతో బిల్లుపై తేల్చాలని రాష్ట్రపతి ఎన్నికల సంఘానికి పంపారు. లాభదాయకమైన జోడు పదవులు అనుభవిస్తున్న కారణంగా ఈ 21 మందిని అనర్హులుగా ప్రకటించాలా వద్దా తేల్చాలని రాష్ట్రపతి ఎన్నికల సంఘాన్ని కోరారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా 21 మంది ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులిచ్చింది. దీనికి వారు వివరణ కూడా ఇచ్చారు.

ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేపథ్యంలో జర్నైల్‌ సింగ్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. ఇక మిగిలిన 20 మంది ఎమ్మెలపై వేటు వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. రిణామాల నేపథ్యంలో జర్నైల్‌ సింగ్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. ఇక మిగిలిన 20 మంది ఎమ్మెలపై వేటు వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -