Wednesday, May 1, 2024
- Advertisement -

తన గొయ్యి తానే తవ్వుకున్న కేసీఆర్

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బహుశా వచ్చే శుక్రవారం జరగనున్న పూర్తి స్థాయి సమావేశంలో తమ నిర్ణయం ఉండవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓపీ రావత్ చెప్పారు. అప్పుడు కూడా చర్చ, జరగవచ్చు కానీ, నిర్ణయం తీసుకోవచ్చు, లేకపోవచ్చు, అని తెలిపారు. ఏదో పైపైన పరిశీలించి, హడావుడిగా నిర్ణయాలు తీసుకుని, జరిపించేస్తామంటే, అవాంతరాలు ఏర్పడితే అప్పుడు అంతా ఈసీనే ఆడిపోసుకుంటారని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారితో సంప్రదింపులు జరిపి, పరిస్థితులపై రిపోర్ట్ తెప్పించుకోవాల్సి ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరినీ తాము కలుస్తామన్నారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీతో ఈసీ మాట్లాడిందన్నారు. అయితే మీడియాలో వస్తున్న పలు ఊహాజనిత ప్రశ్నలకు ఎలక్షన్ కమిషన్ స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

అసెంబ్లీని రద్దు చేసినట్లు తమకు గవర్నర్, ఈష్ట్ర ఎన్నికల కమిషన్, చీఫ్ సెక్రటరీ, అసెంబ్లీ కార్యదర్శి నుంచి నివేదికలు వచ్చాయి కనుక. వాటిపై ఆటోమేటిక్ గా ఆలోచన చేపడతామని వివరించారు. ఎన్నికల నిర్వహణ ఖర్చు, కావల్సిన సిబ్బంది, సెక్యూరిటీ, సాధ్యాసాధ్యాలపై ఓ అంచనాకు వస్తామని తెలిపారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్ గఢ్ ఎన్నికలతో తెలంగాణ ఎన్నికలు జరుగుతాయో లేదో చెప్పలేమన్నారు. కానీ తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికలు, ఫలితాలు ఫలానా అప్పుడే జరుగుతాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా చెప్పగలరని ఓపీ రావత్ నిలదీశారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది పూర్తిగా రాజ్యాంగపరమైన అధికారం కలిగిన కేంద్ర ఎన్నికల కమిషన్‌కే ఉందని చెప్పారు. కానీ ఎలక్షన్లు ఫలానా తేదీల్లో జరుగుతాయని చెప్పి కేసీఆర్ చాలా తప్పు చేశారని రావత్ మండిపడ్డారు. ఆయన పరిధి దాటి మాట్లాడారని వ్యాఖ్యానించారు.

అయితే కేసీఆర్ అత్యుత్సాహంతో నోటిఫికేషన్, ఎన్నికలు, ఫలితాలు ఫలానా నెలలో జరుగుతాయి అని చెప్పడంపై ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు పెద్ద రాద్ధాంతం చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నాయి. ఎన్నికల తేదీలను నిర్ణయించేది ఎలక్షన్ కమిషనా ? కేసీఆరా ? అని నిలదీస్తున్నాయి. కేసీఆర్ ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఆయన ముందే చెప్పిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరపించాలని ఈసీకీ సూచనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పెద్దలతో మాట్లాడుకుని, ముందే అంతా సెట్ చేసుకుని ముందస్తుకు వెళ్లారని ఆరోపిస్తున్నారు. అక్టోబర్ లో నోటిఫికేషన్, నవంబర్ లో ఎన్నికలు, డిసెంబర్ లో ఫలితాలు వస్తాయని కేసీఆర్ ఎలా చెప్పగలిగారని నిలదీస్తున్నారు. ఓ రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహించాలంటే…..అనేక అంచనాలు, ఏర్పాట్లు, ఖర్చు, సెక్యూరిటీ, ఎన్నికల సిబ్బంది, వాతావరణం రిపోర్టులు, ఇతర ఇబ్బందులు అన్నీ పరిశీలించి షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తి చేయడానికే కొన్ని నెలల సమయం పడుతుంది. పైగా ఇప్పుడు నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావాల్సి వుంది. దాని కోసం గత ఆరు నెలలుగా ఈసీ కసరత్తు చేస్తోంది.

అలాంటిది ఇలా అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే అలా ఎన్నికల నోటఫికేషన్, నిర్వహణ, ఫలితాలపై కేసీఆర్ ఎలా మాట్లాడారని విపక్షాలన్నీ విరుచుకుపడుతున్నాయి. దీంతో ఈసీ కూడా స్పందించి కేసీఆర్ లక్ష్మణరేఖ దాటి మాట్లాడారని మండిపడుతోంది. ఒకవేళ ఈసీ కేసీఆర్ చెప్పినట్టే షెడ్యూల్ విడుదల చేస్తే…ఇంక ఈసీ పూర్తిగా తన విశ్వసనీయత కోల్పోయినట్లే. కేసీఆర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని, ఆయన చెప్పినట్లే చేస్తున్నారని దేశమంతా రచ్చ రచ్చ జరగడం ఖాయం. ఈ నేపథ్యంలో కచ్చితంగా ఈసీ తన పారదర్శకతను చాటుకోవడానికి, కేసీఆర్ ప్రభావం తమ మీద లేదని చెప్పుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. లేదంటే తన చిత్తశుద్ధి, సిన్సియారిటీనే అనుమానించాల్సి వస్తుంది. కనుక ఆచితూచి అడుగేయటం ఖాయం. మొత్తానికి కేసీఆర్ భావించినట్టే ఎన్నికలు జరగాల్సి ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో అలా జరపడానికి ఈసీ కచ్చితంగా వెనుకడుగు వేస్తుంది. దీంతో కేసీఆర్ తన గొయ్యి తానే తీసుకున్నాడని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -