Monday, April 29, 2024
- Advertisement -

ఈసీ వెల్ల‌డి

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రాక‌ముందునుంచె అధికార‌పార్టీ మంత్రులు అంద‌రూ అక్క‌డ‌నె మ‌కాం వేసి ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు.అయితే అది ఇప్పుడు టీడీపీకి ఇబ్బందిక‌రంగా మారింది.రాష్ట్రంలో బాగా హీటెక్కిస్తున్న నంద్యాల ఉపఎన్నకలో మంత్రులు యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పలువురు మంత్రులపై నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదులు అందినట్లు ఎన్నికల కమీషనర్ బన్వర్ లాల్ చెప్పారు.

ఉపఎన్నిక షెడ్యూల్ కు ముందునుండే చంద్రబాబునాయుడుతో సహా మంత్రుల్లో చాలా మంది నంద్యాలలోనే క్యాంపు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఓటర్లను సామాజికవర్గాల వారీగా టిడిపి విడదీసింది. సామాజిక వర్గాలను అందులోనూ ఎవరికైనా పదోట్లున్నాయనుకుంటే వారిని మరింత ప్రత్యేకంగా చూసుకుంటోంది.

మంత్రులు, నేతలు, అధికారుల సాయంతో రెచ్చిపోతున్నారు. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు ఎంత మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. అయితే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత టిడిపి జోరు కాస్త తగ్గినా ప్రలోభాల పర్వమైతే ఆగలేదు. ఇప్పటికీ మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు మండలాల వారీగా సామాజికవర్గ నేతలను కలుస్తూనే ఉన్నారు. చివరకు మతాల వారీగా కూడా సమావేశాలు పెట్టీ మరీ ప్రలోభాలకు దిగుతున్నారు.

అయితే ఈసీ మాత్రం ఖ‌టిన నిర్న‌యాలు తీసుకుంటోంది. ఎ న్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి మంత్రులు, కొందరు నేతలపై ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. రెండు మూడు రోజుల్లో వారి పేర్లు, వారిపై ఏం యాక్షన్ తీసుకుంటున్నామో ప్రకటిస్తామని స్పష్టం చేసారు.ఆమంత్రులు ఎవ‌రనేదానిపై ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెల‌కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -