Monday, April 29, 2024
- Advertisement -

వైఎస్ జ‌గ‌న్‌తో స‌వాంగ్‌, స్టీఫెన్ ర‌వీంద్ర‌ గంట‌కు పైగా భేటీ..

- Advertisement -

మూడు రోజుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ప‌రిపాల‌న ఎలా ఉండాల‌నేదానిపై దృష్టిసారించారు. ఇప్ప‌టికే త‌న టీమ్‌లో ఎవ‌రెవ‌రు ఉండాలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఢిల్లీ నుంచి వ‌చ్చిన జ‌గ‌న్ను తాడే ప‌ల్లిలోని ఆయ‌న నివాసంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ‌చ్చి మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు.

రాష్ట్రంలో ప‌రిపాల‌న స‌జావుగా సాగాలంటె డీజీపీతోపాటు ఇంటెలిజెన్స్ వ్య‌వ‌స్థ లు బాగా ప‌నిచేయాలి. గ‌త బాబు పాల‌న‌లో అన్ని వ్వ‌వ‌స్థ‌లు ప్ర‌జ‌ల‌కోసం కాకుండా అధికార పార్టీ టీడీపీకీ అనుకూలంగా ప‌నిచేశాయ‌నె విమ‌ర్శ‌లు కోకొల్ల‌లు. ఈసారి జ‌గ‌న్ అలాంటి విమ‌ర్శ‌లు రాకుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ఏపీ కొత్త డీజీపీగా గౌత‌మ్ స‌వాంగ్‌, ఇంటెలెజెన్స్‌ చీఫ్‌గా తెలంగాణాలో ప‌నిచేస్తున్న స్టీఫెన్ ర‌వీంద్ర‌లు రానున్నార‌నె వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. వాట‌న్నింటిని నిజం చేస్తూ ఈరోజు ప్ర‌స్తుతం విజిలెన్స్‌ డీజీ గౌతమ్‌ సవాంగ్‌, హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర భేటీ జ‌గ‌న్‌తో అయ్యారు. తాడే ప‌ల్లిలోని ఆయ‌న నివాసంలో సుమారు గంట‌కు పైగా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. వీరి భేటీ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేసిన వెంట‌నె ఇద్ద‌రూ కూడా బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి.

ఏపీ డీజీపీగా సవాంగ్‌, ఇంటెలెజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్‌ రవీంద్ర నియమితులు కానున్నారనే వార్తల నేపథ్యంలో ఈ భేటీప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, నూతన అధికారుల ఎంపికపై సవాంగ్‌, రవీంద్రతో జగన్‌ చర్చించినట్టు తెలిసింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -