Sunday, April 28, 2024
- Advertisement -

జగనే బ్రాండ్ అంబాసిడర్.. ఇక పెట్టుబడులు క్యూ కట్టేనా ?

- Advertisement -

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి దాదాపుగా మూడు సంవత్సరాలు దాటింది. అయితే ఈ మూడు సంవత్సరాలలో పెట్టుబడులను ఆకర్షించడంలో జగన్ పూర్తిగా విఫలం అయ్యారని ప్రతిపక్ష టీడీపీ పార్టీ గట్టిగా ఆరోపణలు చేస్తూ వచ్చింది. అయితే టీడీపీ చేసిన ఆరోపణలలో ఎంతో కొంత నిజం ఉందనే విషయాన్ని కచ్చితంగా ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పుకోదగ్గ స్థాయిలో బడా కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్దగా ఆసక్తికనబరిచిన దాఖలాలు లేవు. అరకొర కంపెనీలు తప్పా రాష్ట్ర ప్రభుత్వం గర్వించదగ్గ స్థాయిలో పెట్టుబడులు లేవనేది టీడీపీ వాదన.

ఇప్పుడు జగన్ హయాంలో ఉన్న స్టార్టప్ కంపెనీలు కూడా బాబు హయాంలోనే వచ్చినవని టీడీపీ శ్రేణులు తరచూ చెబుతూనే ఉన్నారు. ఇదిలా ఉంచితే.. బడా కంపెనీలు ఏపీ వైపు చూడకపోవడానికి ఏపీపై ఉన్న రుణభారం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. దాంతో వీటన్నిటికి చెక్ పెడుతూ ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడానికి జగన్ సర్కార్ గట్టి ప్రణాళికలు వేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 2,3,4, తేదీల్లో విశాఖా వేధికగా గ్లోబల్ ఇన్వస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం పెట్టుబడులను ఆకర్షించడమే అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పుకొచ్చారు.

ఇందుకు సంబంధించిన లోగోను తాడేపల్లి క్యాంప్ లో సి‌ఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం పెట్టుబడులను ఆకర్షించడమేనని, ఇక ముందు రాష్ట్రనికి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అమర్నాథ్ అన్నారు. అంతే కాకుండా పెట్టుబడులను ఆకర్శించేందుకు సి‌ఎం జగనే తమ బ్రాండ్ అంబాసిడర్ అంటూ చెప్పుకొచ్చారు. ఏపీలో అవకాశం ఉన్న అన్నీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్శించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు అమర్నాథ్ అన్నారు. మరి ఏపీ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లుగా జగన్ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుబడులను ఎంతమేర ఆకర్షిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

బీజేపీ తెగించిందా.. ఏంటి ఈ కబ్జా రాజకీయాలు !

మూవీ పాలిటిక్స్.. ఇదే గురూ మన ట్రెండు !

ముందస్తు ఎన్నికలు వస్తే లాభం ఎవరికి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -