Sunday, April 28, 2024
- Advertisement -

బీజేపీ నేతలు పొలిటికల్ టెర్రరిస్టులు: శివాజీ

- Advertisement -

ప్రముఖ సినీ నటుడు శివాజి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రప్రభుత్వం నేడో రేపో నోటీసులు పంపనుందని చెప్పారు. ఆపరేషన్ ద్రవిడలో భాగంగా ఆపరేషన్ ద్రవిడ చాలా రోజుల క్రితమే చేపట్టారు. అయితే ఆపరేషన్ గరుడ లీకైపోవడంతో బీజేపీ నేతలు ఇన్నాళ్లూ కిక్కురుమనకుండా కూర్చున్నారు. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత మెల్లగా ఆ విషయం ప్రజలు మరిచిపోతున్న సమయం చూసుకుని, మళ్లీ ఏపీ సీఎంపై పంజా విసురుతున్నారని శివాజీ మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఓ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని, ఓ రాష్ట్ర భవిష్యత్ తో ఆటలాడుకోవడం అత్యంత సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కేంద్రప్రభుత్వం ఓ సీఎంపై కక్షగట్టి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో పాగా వేయడానికి వేస్తున్న ఎత్తులు, నీచరాజకీయాలు అత్యంత దారుణంగా ఉన్నాయని శివాజీ నిప్పులు చెరిగారు. చంద్రబాబు స్థానంలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నాసరే తాను ఇలాగే మాట్లాడుతానన్నారు. తనకు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం, జాతీయస్థాయిలోని రాజ్యాంగ బద్ధంగా పని చేస్తున్న సంస్థ నుంచి చంద్రబాబుకు నోటీసులు అందజేయనున్నారు. నాకు తెలిసిన దాని ప్రకారం వచ్చే సోమవారం చంద్రబాబుకు ఆ నోటీసులు అందుతాయి. అయితే ఇప్పటికే సమాచారం లీకైపోవడంతో బహుశా ఓ నాలుగైదు రోజులు ఆలస్యం కావచ్చు. కానీ నోటీసులు ఇవ్వడం తథ్యం. ఇది ముమ్మాటికీ చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని బీజేపీ నేతలు చేస్తున్న కుట్రే. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ముఖం చాటేసిన బీజేపీ నేతలు పొలిటికల్ టెర్రరిస్టులుగా మారారాని శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ గరుడ గురించి తాను ముందే లీక్ చేసి, హెచ్చరించడంతో అప్పటి నుంచి తనపై కక్షగట్టారని, తనకు ప్రాణహాని ఉందని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ సీం పోస్టు నుంచి చంద్రబాబును ఎన్నికలకు ముందే తొలగించాలని బీజేపీ పంజా విసురుతోందని శివాజీ ఆరోపించారు. ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి ప్రజలను మోసం, ఇప్పుడు ఏపీలో ఏం ముఖం పెట్టుకుని తిరగాలనుకుంటున్నారని బీజేపీ నేతలనుద్దేశించి శివాజీ నిలదీశారు.

ఏపీలో అధికారం కోసం స్వార్ధపూరిత రాజకీయ విక్రృత క్రీడ ఆడుతున్నారని, ఇదేనా ప్రజాస్వామ్య స్ఫూర్తి ? అని శివాజీ ప్రశ్నించారు. రాజకీయంగా ప్రత్యర్ధులను అడ్డు తొలగించుకోవాలంటే ప్రజల మనసులు గెల్చుకోవాలని కానీ, ఇలా అడ్డదారిలో రాజ్యాంగ బద్ధ సంస్థలను అడ్డం పెట్టుకుని, అరాచకాలు సృష్టించి అధికారంలో ఉన్న సీఎంను తప్పించి, రాజకీయజూదం ఆడాలనుకోవడం తగదని మండిపడ్డారు. ఇచ్చినమాట తప్పి బీజీపేనీ ఏపీలో చేతులారా చంపుకున్న కమలనాథులు, ఇప్పుడు తమ పార్టీని బతికించుకోవడానికి చంద్రబాబును టార్గెట్ చేశారని శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం అంటే ఆ రాష్ట్ర ప్రజలను లక్ష్యంగా చేసుకున్నట్టేనని మండిపడ్డారు. గతంలో తాను చెప్పిన ఆపరేషన్ గరుడ నేడు వేరే రూపంలో అమలు చేస్తున్నారని శివాజీ ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -