Tuesday, April 30, 2024
- Advertisement -

మ‌న భాగ్య‌న‌గ‌రేనా… రూపురేఖలు మారిన సిటీ

- Advertisement -
  • అతిథులొస్తే ఎంత మార్పో…. మ‌న భాగ్య‌న‌గ‌రేనా… రూపురేఖలు మారిన సిటీ
  • ఆశ్చ‌ర్య‌పోతున్న న‌గ‌ర‌వాసులు
  • ఇక నెల‌కోసారి ఎవ‌రైనా ప‌ర్య‌టించాల‌ని ప్ర‌జ‌ల కోరిక‌

ప్ర‌పంచ స‌ద‌స్సు నేప‌థ్యంలో హైద‌రాబాధ‌లు తీరుతున్నాయి. ఆ స‌ద‌స్సు పుణ్యామా అని న‌గ‌ర‌వాసులు క‌ష్టాలు తీర‌డంతో ప్ర‌జ‌లంద‌రూ ఇవాంకా ట్రంప్‌న‌కు ధ‌న్య‌వాదాలు చెబుతున్నారు. ప్ర‌భుత్వం ఎన్ని క‌థ‌లు చెప్పినా ఈ అభివృద్ధి ప‌నులు మాత్రం ఆ స‌ద‌స్సు నేప‌థ్యంలో చ‌కాచ‌కా జ‌రుగుతున్నాయి. ఈ అభివృద్ధి ప‌నులు చూసి బాబా సినిమాలో స‌న్నివేశాన్ని గుర్తుకొతెస్తోంది. అయితే ఈ ప‌నుల‌తో తాము రోజు అనుభ‌విస్తున్న క‌ష్టాలు కొంత తీరాయ‌ని ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఓటు వేసిన ప్ర‌జ‌ల‌కు ప‌నులు చేయ‌రు కానీ ఎవ‌రో విదేశీయులు వ‌స్తే కోట్లు కోట్లు కుమ్మ‌రించి ఇన్ని ప‌నులు చేస్తారా అని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక ఆ ఓట్లు కూడా విదేశీయుల‌కే వేస్తామ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ విధంగా ప్ర‌భుత్వం తీరు మారింది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో పోలోమ‌ని ఓట్లు కారుకేసి గుద్దినా ప‌నులు జ‌ర‌గ‌లేదు. మూడేళ్లు స‌మ‌స్య‌ల‌తో ప్ర‌జ‌లు స‌త‌మ‌త‌మ‌య్యారు. కొత్త పాల‌న వ‌చ్చాక ఇప్పుడే ప‌నులు బాగా జ‌రుగుతున్నాయి. అయితే ఇవాంకా ట్రంప్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో కొంద‌రు సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వం తీరుపై తమ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. అవి మీరే చూడండి.

అమ్మ ఇవంక!! నీ వంకతో మా బండ్లకు మంచి రోడ్లిచ్చావు      
నీ వంకతో మా నడుములు విరగొట్టుకోకుండా అవకాశమిచ్చావు
నీ వంకతో నడవడానికి పాదచారుల బాటలిచ్చావు
నీ వంకతో మా ట్రాఫ్ఫికు తగ్గించావు
నీ వంకతో బిచ్చగాల్లను తరిమేసావు
నీ వంకతో పాతనగరాన్ని అలకరించావు
నీ వంకతో దుమ్ముకొట్టుకపోయిన ఫ్లై ఓవర్లని శుభ్రం చెసావు
నీ వంకతో మా కార్పోరేషన్ వాల్లకి కొలాగొట్టడానికి అవకాశమిచ్చావు
అందుకే నువ్వు మాకు నచ్చావు!మాకు నచ్చావు!
అలాగే మా హైదరాబాద్లో హైటెక్ కాకుండా అన్నీ కాలనీలు తిరగాలని కోరుతూ..
– (pulse of telangana) ఫేస్‌బుక్ పేజీ
—————————————————
అబ్బ…
ఈ ట్రంప్ అంకుల్ ఇవాంక అక్కని నెలకోసారి తెలంగాణ అంతా తిరిగిరమ్మని పంపితే బాగుండే..
రోడ్ల మీద గుంతలుండయ్..
రోడ్ల కింద నీళ్లుండయ్..
అసలు తెలంగాణల పెండింగ్ పనులే ఉండయ్…
ఒక్క దినం ట్రాఫిక్ ని భరిస్తుంటిమి..
పంపుతడో లేదో…
– (ముద్ద‌గౌని శివ‌శంక‌ర్‌)
——————————————————–
మన ‘భాగ్యనగరం’ ఇంట్లో ఉన్న అమ్మాయిలాంటిది
ఎవరన్నా సుట్టాలొస్తే సుందరంగా తయారవుతది
వచ్చిన అతిథులకు మర్యాదలు బాగా జేస్తది
కానీ ఇంట్లో ఉన్నవారిని ఏనాడూ పట్టించుకోదు నరకం, బాధలు పెడతాది
అతిథి దేవోభవను తూచ పాటిస్తది
ఇంట్లో వారిని నరక ప్రాప్తిరస్తు అంటది…
– (ఎస్‌.ర‌వికుమార్‌)
——
ఈ విధంగా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న హైద‌రాబాద్ అభివృద్ధి ప‌నుల‌పై స్పందిస్తున్నారు. ఇప్పుడు
హైద‌రాబాద్ రోడ్లు త‌ళ‌త‌ళ మెరుస్తున్నాయ్‌..
ఫ్లై ఓవ‌ర్లపై క‌ళాఖండాలు ఆహ్వానిస్తున్నాయ్‌..
ఒక్క కాగితం ముక్క క‌నిపించ‌క సువాస‌న‌లు వెద‌జ‌ల్లుతున్నాయ్‌..
వీధి దీపాలు నిరంత‌రం వెలుగుతున్నాయ్‌..
ఇప్ప‌డు విశ్వ‌న‌గ‌రంగా పేరు పొందుతుందో లేదో సూడాలి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -