Tuesday, April 23, 2024
- Advertisement -

మోదీకి కలిసి సూచనలు ఇచ్చాను: ఎంపీ రఘురామకృష్ణరాజు..!

- Advertisement -

ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను వివరించినట్టు.. ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులు, అమరావతి అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లానని దిల్లీలో తెలిపారు. రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించినట్టు చెప్పారు.

అమరావతిపై మోదీ సానుకూలంగా ఉన్నట్లు.. ఆయన ముఖకవళికల ద్వారా స్పష్టంగా అర్థమైందన్నారు. అమరావతిలో ఇప్పటికే వేల కోట్లతో భవనాలు కూడా నిర్మాణం పూర్తయిందని.. ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్థితుల్లో విశాఖలో కొత్త రాజధాని ఏర్పాటు అసాధ్యమని ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.

వ్యవసాయ చట్టాలపై ప్రధానికి కొన్ని సూచనలు చెప్పానని రఘురామ చెప్పారు. సీఎం జగన్.. పార్టీ ఎంపీలను వెంటబెట్టుకుని ప్రధానిని కలవాలని.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెనక్కు తీసుకునేలా విజ్ఞప్తి చేయాలని ఆయన అన్నారు.

ఎన్నికలు అంటే ఏకగ్రీవాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని.. రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్​పీటీసీ ఎన్నికల్లో మంచి చేయాలని అనుకునే వాళ్లంతా పాల్గొనాలని చెప్పారు.

మేయర్ విజయలక్ష్మికి ఫ్లెక్సీ షాక్..!

‘ధూమ్’ సీక్వెల్ లో దుమ్ములేప‌నున్నదీపిక !

ఘట్‌కేసర్‌ అత్యాచారం కేసు.. ట్విస్టుల మీద ట్విస్టులు.. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -