Friday, May 24, 2024
- Advertisement -

సిరీస్ సాధిస్తారా….? చేతులెత్తేస్తారా…?

- Advertisement -

శ్రీలంక‌తో మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా చివ‌రివ‌న్డే అదివారం విశాఖ‌లో జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఇరు జ‌ట్ల ఆట‌గాల్లు విశాఖ చేరుకొన్నారు. మొద‌టి వ‌న్డేలో ఓడిన ఇండియా ….రెండో వ‌న్డేలో అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించి టీమిండియా సిరీస్‌పై క‌న్నేసింది. ఆఖరిదైన మూడో వన్డేలో విజయం సాధించి మరో సిరీస్‌ను చేజిక్కించుకునేందుకు టీమిండియా తమ వ్యూహాలకు పదును పెడుతోంది.

సిరీస్ 1-1తో స‌మం కావ‌డంతో సిరీస్‌ ఫలితం కోసం మూడో వన్డే కీలకంగా మారింది. తొలి వన్డేలో లంకేయుల విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఆదివారం డా.వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగే మూడో వన్డేలో గెలుపు కోసం ఇరు జట్లు తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాయి. రేపు మధ్యాహ్నం గం. 1.30 ని.లకు నిర్ణయాత్మక ఆఖరి వన్డే ఆరంభం కానుంది.

సుదీర్ఘ కాలంగా భారత గడ్డపై టెస్టుల్లో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయిన లంకేయులు.. వన్డేల్లో కూడా దాదాపు అదే కథను పునరావృతం చేశారు. ప్రధానంగా ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత గడ్డపై లంక పూర్తిగా తలవంచింది. ఇక్కడ ఇప్పటివరకూ తొమ్మిది వన్డే సిరీస్‌ల్లో తలపడిన లంక ఒక్కసారి సిరీస్‌ను డ్రా చేసుకోవడం మినహా ప్రతీసారి ఓడింది.

టీమిండియాకు విశాఖలో తిరుగులేని రికార్డు ఉంది. ఇప‍్పటివరకూ ఇక్కడ వన్డే మ్యాచ్‌లు జరగ్గా, అందులో భారత్‌ ఐదింట విజయం సాధించింది. మరొకమ్యాచ్‌లో ఓటమి పాలు కాగా, ఒక మ్యాచ్‌ రద్దయ్యింది. ఇక్కడ గతేడాది అక్టోబర్‌లోన్యూజిలాండ్‌తో చివరిసారి వన్డే మ్యాచ్‌లో తలపడిన టీమిండియా 190 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేయగా, న్యూజిలాండ్‌ 79 పరుగులకు ఆలౌటైంది. ఆదివారం జ‌రిగే మూడో వ‌న్డే ఇరు జ‌ట్ల‌కు కీల‌కంకానుండ‌టంతో మ్యాచ్ ర‌వ‌స‌త్త‌రంగా జ‌ర‌గ‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -