Tuesday, May 7, 2024
- Advertisement -

పనామా పత్రాల్లో తెలుగొళ్లు..

- Advertisement -

గొప్ప గొప్ప విజయాలు సాధించడంలోనే కాదు… ప్రభుత్వాలకు శఠగోపాలు పెట్టడంలో కూడా తెలుగు వారు ఘనులే. ప్రపంచాన్ని కుదిపేస్తున్న పనామా పత్రాల వ్యవహారంలో ముగ్గురు తెలుగు వారు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. పనామా కుంభకోణంలో 500 మంది భారతీయులుంటే అందులో ముగ్గురు తెలుగు వారు ఉన్నట్లు తెలుస్తోంది.

వీరితో పాటు భారతీయ పారిశ్రామిక వేత్తలు కూడా ఉండడం మరో విశేషం. ఇక మన తెలుగు వారు ఎవరంటే… ఒకరు మోతూరి శ్రీనివాస ప్రసాద్. ఈయనకి విదేశాల్లో నాలుగు కంపెనీలున్నట్లుగా ఫొన్సెకా పత్రాల్లో వెల్లడైంది. 2011 సంవత్సరంలో ఈ కంపెనీలు రిజిస్టర్ అయినట్లు పనామా పత్రాల్లో వెల్లడైంది. ఇక తన కంపెనీలపై శ్రీనివాస ప్రసాద్ వివరణ ఇచ్చారు. తాను కేవలం ఒక్క డాలరుతోనే కంపెనీ స్ధాపించానని, అయితే అది ప్రస్తుతం మూసివేశామని అన్నారు. ఇక రెండో భావనాసి జయకుమార్.

ఈయన కంపెనీ పేరు నందస్ టెక్నాలజీస్ లిమిటెడ్ తో పాటు మరో రెండు కంపెనీలున్నాయి. ఇద్దరు డైరక్టర్లతో కలిసి ఈ కంపెనీలు పెట్టిన ఈయన తనకు ఈ కంపెనీలతో ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. తెలుగు వారిలో మూడో వ్యక్తి వోలం భాస్కర రావు. ఈయన నందన్ టెక్నాలజీస్ సంస్ధకు మేనేజింగ్ డైరక్టర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వ్యాపారాల నుంచి తప్పుకున్న ఈయన బ్రిటన్ లో సెటిల్ అయ్యారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -