Sunday, April 28, 2024
- Advertisement -

జగన్.. బొత్సల మధ్య దానిపై చర్చ..?!

- Advertisement -

ఎన్నికలముందు జగన్ మోహన్ రెడ్డి.. వచ్చే వారు రండి, పోయే వారు పొండి అన్న దృక్పథాన్ని అనుసరించాడు. ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లోని పాత సామాన్లన్నింటినీ దగ్గరకు తీసుకొన్నాడు.

వాళ్ల శక్తి సామర్థ్యాలు ఏమిటి.. అనే లెక్కలు పరిగణనలోకి తీసుకోకుండా బాబు కాంగ్రెస్ నేతలను పార్టీలోకి చేర్చుకొన్నాడు. అలా వచ్చిన వారు డబ్బును మంచి నీళ్లలా ఖర్చు పెట్టగలిగే శక్తి ఉన్న వారు కావడంతో టీడీపీకి ప్లస్ పాయింట్ అయ్యింది.

అయితే అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ నేతలను ఖాతరు చేయలేదు. వాళ్లు తన వెంట వచ్చినా రాకపోయినా.. తనపార్టీ గెలుస్తుందని వస్తే వాళ్లకే మంచిది, రాకపోతే పోయారు.. అనుకొన్నట్టుగా జగన్ వ్యవహరించాడు. అయితే అందుకు తగ్గ నష్టం జరగనే జరిగింది. అయితే ఇప్పుడు జగన్ లో ఆ తీరు కొంత మారినట్టుగా ఉంది.
తాజాగా జగన్ మోహన్ రెడ్డికి బొత్స సత్తిబాబును పార్టీలోచి చేర్చుకోవడం పట్ల ఆసక్తిని కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. జగన్ దగ్గర నుంచి ఈ ప్రతిపాదన వచ్చినా.. బొత్స దగ్గర నుంచి వచ్చినా.. మొత్తానికి చర్చలు అయితే ఊపందుకొన్నట్టుగా తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో ని తన పార్టీ నేతలను ఒప్పించుకని బొత్సను పార్టీలోకి చేర్చుకోవడానికి జగన్ చొరవచూపుతున్నాడని టాక్. అందరినీ ఒప్పించాకే.. బొత్సను చేర్చుకోవాలని జగన్ భావిస్తున్నాడని సమాచారం.

మరి ఈ చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అన్నీ కుదిరితే మాత్రం బొత్స వైకాపాలో చేరడం ఖాయమేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -