Wednesday, May 1, 2024
- Advertisement -

భార‌త్‌లో ఐసిస్ క‌ల‌క‌లం…

- Advertisement -

దేశంలో మరోసారి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ కలకలం రేపుతోంది. ఐసిస్‌కు అనుకూలంగా “హర్కత్‌ ఉల్‌ అరబ్‌ ఏ ఇస్లాం” పేరిట ఓ ఉగ్ర విభాగం పనిచేస్తోందని తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది. ఆ కేసుకు సంబంధం ఉన్న 16 చోట్ల ఇవాళ ఎన్ఐఏ పోలీసులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే అయిదుగుర్ని అరెస్టు చేశారు. మ‌రో ప‌ది మందిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టైన నిందితుల్లో ఒకరిని స్థానిక మదర్సా నుంచి అదుపులోకి తీసుకోగా.. మిగతా వారిని అమ్రోహలోని ఇతర ప్రదేశాల్లో ఉండగా అరెస్టు చేశారు. కొత్త పేరుతో దేశంలో వీరు ఐసిస్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు భావిస్తున్న ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. ఢిల్లీతో పాటు యూపీలోని కొన్ని ప్రాంతాలు ఈ దాడులు కొన‌సాగుతున్నాయి.

కొత్త త‌ర‌హా ఉగ్ర మాడ్యూల్‌ను నిర్వ‌హిస్తున్న ఓ మౌలానాతో పాటు సివిల్ ఇంజినీరింగ్ మూడ‌వ సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్ద‌రూ కొత్త మాడ్యూల్‌కు సూత్ర‌ధారుల‌ని ఎన్ఐఏ నిర్ధారించింది. వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న రిప‌బ్లిక్ డే సంబ‌రాల‌కు ముందు దేశ రాజ‌ధానితో పాటు యూపీలోని ప‌లు చోట్ల దాడుల‌కు ప్లానేసిన‌ట్లు ఎన్ఐఏ పేర్కొన్న‌ది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -