Monday, April 29, 2024
- Advertisement -

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌….

- Advertisement -

జార్ఖండ్ అడ‌వుల్లో మ‌రో సారి తుపాకుల మోత మోగింది. సింగభూం జిల్లా పరిధిలోని అడవుల్లో ఈరోజు ఉదయం (జనవరి 29)న భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో మావోయిస్టుల‌కు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. మంగళవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.

చత్తీస్‌గఢ్‌కు సమీపంలో ఉన్న ఖుంతీ, సింగ్భమ్ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నార‌న్న ప‌క్కాస‌మాచారంతో .సెంట్రల్ రిజర్వ్ పోలీసులు, కోబ్రా బెటాలియన్, రాష్ట్ర సాయుధ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. వీరికి మావోలు తారసపడగా, లొంగిపోవాలని హెచ్చరించినా, వారు వినకుండా కాల్పులు జ‌ర‌ప‌డంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు ఓ అధికారి తెలిపారు.

ఈఎన్‌కౌంట‌ర్‌లో మ‌రో వ్య‌క్తి గాయ‌ప‌డ్డార‌ని అత‌నికోసం గాలింపు కొన‌సాగుతోంద‌ని అధికారి తెలిపారు. సంఘ‌ట‌నా స్థ‌లం నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లు, ఒక 303 రైఫిల్, మరో ఐదు సాధారణ తుపాకులను స్వాధీనం చేసుకున్నామని, కూంబింగ్ కొనసాగుతోందని ఆ అధికారి పేర్కొన్నారు.

మావోయిస్టుల‌కు పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -