Tuesday, May 7, 2024
- Advertisement -

జాన్స‌న్ బేబీ పౌడ‌ర్ వాడుతున్నారా..అయితే జాగ్ర‌త్త‌…?

- Advertisement -

త‌ల్లిదండ్రులూ మీ చంటిపిల్లలకు స్నానం చేయించిన తర్వాత పౌడర్ రాస్తున్నారా..? ఆ పౌడర్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్‌దేనా అయితే తస్మాత్ జాగ్రత్త. జాన్సన్ అండ్ జాన్సన్స్ కంపెనీ తయారు చేస్తున్న బేబీ పౌడీర్‌లో క్యాన్స్ కారకాలు ఉండొచ్చని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

పౌడ‌ర్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలు ఉన్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక జరిపిన ఇన్వెస్టిగేషన్‌లో బయటపడింది. ఇప్పటికే పలుమార్లు జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్‌ను ల్యాబ్‌లో పరీక్షించగా యాస్బెస్టాస్ (నారరాయి పదార్థం) అందులో కలిసి ఉన్నట్లుగా తేలినట్లు ఆ ఆంధ్రపత్రిక వెల్లడించింది.

గతవారం ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనంతో మనదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సీజ్ చేసింది. దీనిపై ఇప్పటి వరకు భారత్‌లోని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు

జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ సురక్షితమైంది. అందులో ఎలాంటి ఆస్‌బెస్టాస్ లేదు.’ అని కంపెనీ స్పష్టం చేసింది. ‘లక్ష మందికి పైగా పురుషులు, మహిళల మీద ఎన్నో పరిశోథనలు చేశాం. ఆస్‌బెస్టాస్ వల్ల కలిగే ఎలాంటి వ్యాధులు కానీ వారికి రాలేదు. కొన్ని వేలకు పైగా ఇండిపెండెంట్ టెస్టులు జరిగాయి. మా బేబీ పౌడర్‌లో ఎలాంటి ఆస్‌బెస్టాస్ లేదని ప్రపంచంలోని ప్రముఖ ల్యాబ్‌లు కూడా స్పష్టం చేశాయి.’ అని కంపెనీ ప్రకటనలో తెలిపింది.

మ‌రో వైపు తెలంగాణాలో కూడా వాటి శాంపిల్స్ సేకరిస్తున్నారు. శాంపిల్స్ సేకరించాల్సిందిగా తెలంగాణలో డ్రగ్ శాఖ అధికారి సురేంద్రనాథ్ సాయి డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. వాటిని ల్యాబ్స్‌కు పంపించారు.ఒకవేళ నిజంగానే ఇందులో హాని కలిగించే పదార్థాలు ఏమైనా ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -